RGV : ప్రపంచ సుందరి గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ ని ఇష్టపడని మగవాడు ఉంటాడా చెప్పండి. తన కాబొయ్యే భార్య ఐశ్వర్య రాయ్ లాగ ఉండాలి అని ప్రతీ మగవాడు కలలు కంటూ ఉంటారు. అంత గొప్ప సౌందర్య రాశి ఆమె. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఆమె కనిపిస్తే చాలు, సినిమా బాగా ఉండాల్సిన అవసరం లేదు, ఆమెని చూసి వచ్చేయొచ్చు అని అనుకునే వాళ్ళు కోట్లలో ఉంటారు.

ఆ రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న ఐశ్వర్య రాయ్ పై ఎన్నో వివాదాలు ఉన్నాయి. అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకోకముందు ఆమె సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ వంటి హీరోలతో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లాడింది. ఇప్పుడు ఆయనతో కూడా విడాకులు తీసుకుంది అంటూ గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారం అవుతూ ఉంది.

కాసేపు ఈ విషయం పక్కన పెడితే, వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ఐశ్వర్య రాయ్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఐశ్వర్య రాయ్ దూరం నుండి చూసేందుకు చాలా బాగుంటుంది. కానీ దగ్గరకి వెళ్లి చూస్తే ఆమె అసలు రూపం ఏంటో తెలుస్తుంది. మేకప్ తీస్తే ఆమెని మనం చూడలేము.

అంతే కాకుండా ఐశ్వర్య రాయ్ అవసరానికి మించి మాట్లాడడం, ఎదురు వ్యక్తిని చూసి వెక్కిలి నవ్వు నవ్వడం వంటివి చేసేది, అందుకే ఆమెని బాలీవుడ్ లో అందరూ ఫేక్ మనిషి అని అంటూ ఉంటారు అని రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నోటికి ఏది తోచితే అది మాట్లాడే రామ్ గోపాల్ వర్మ చెప్పే మాటలను పట్టించుకోవడం మన మూర్ఖత్వం అని సోషల్ మీడియా లో ఐష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.