Renu Desai : రేణు దేశాయ్ రెండవ భర్త ఏమైనట్టు..? అసలు పెళ్లి చేసుకుందా లేదా ?వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు

- Advertisement -

Renu Desai : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ జంట విడిపోయినప్పుడు కోట్లాది మంది అభిమానులు ఎంతలా బాదపడ్డారో అందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ తో విడిపోయినప్పటికీ కూడా రేణు దేశాయ్ ఆయన గురించి చెడుగా మాట మాట్లాడింది లేదు.అంతటి నిజాయితీ పరుడ్ని ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదని ఇప్పటికీ ఆమె చెప్తూనే ఉంటుంది.పిల్లల కోసం వీళ్లిద్దరు అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు.

Renu Desai
Renu Desai

అయితే రేణు దేశాయ్ తో విడాకులు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ రష్యా కి చెందిన అన్నా లెజినోవా ని పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే.రేణు దేశాయ్ కూడా ఒక NRI ని పెళ్లి చేసుకోబోతున్నాను అని ప్రకటించి నిశ్చిదార్థం కూడా జరుపుకుంది.ఇది జరిగి సుమారుగా నాలుగేళ్లు అవుతుంది, కానీ ఇప్పటి వరకు పెళ్ళైందో లేదో అనే విషయం కూడా ఎవరికీ తెలియదు.

Actress Renu Desai
Actress Renu Desai

ఇంతకీ రేణు దేశాయ్ పెళ్లి చేసుకుందా లేదా ..?అనేది ఇప్పటికీ అభిమానుల్లో మెలిగే ప్రశ్న..ఒకవేళ చేసుకొని ఉండుంటే కచ్చితంగా సోషల్ మీడియా లో షేర్ చేసి ఉండేది.ఎందుకంటే నిశ్చితార్థం చేసుకున్నప్పుడు ఫోటోలు పెట్టింది కదా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.అయితే గతం లో రేణు దేశాయ్ ఒక గేమ్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించింది,ఆ షో లో ఈమె తన కాబొయ్యే భర్త గురించి పలు విశేషాలు చెప్పుకొచ్చింది.

- Advertisement -
Renu Desai

అతను అమెరికా లో జాబ్ చేసి, ప్రస్తుతం పూణే లో ఒక ప్రముఖ MNC కంపెనీ కి చైర్మైన్ గా చేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది.ఇలా చెప్పి కూడా మూడేళ్లు దాటింది కానీ,రెండవ పెళ్లి ప్రస్తావన మాత్రం ఇప్పటి వరకు తీసుకొని రాలేదు.అందుతున్న కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని, రేణు దేశాయ్ ప్రస్తుతం ఒంటరిగానే తన పిల్లలతో గడుపుతుందని తెలుస్తుంది.మరి ఈ వార్తలపై రేణు దేశాయ్ స్పందన కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here