పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అయ్యింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. బద్రి సినిమా సమయం లో ఏర్పడిన వీళిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి, కొన్ని రోజులు డేటింగ్ చేసుకున్న తర్వాత పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్న సమయం లోనే అకిరా నందన్ పుట్టాడు. మొట్టమొదట పుట్టిన బిడ్డ కావడం తో పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ ఇద్దరూ కూడా అకిరాని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.

విడిపోయిన తర్వాత కొన్ని రోజులు రేణు దేశాయ్ దగ్గర మరికొన్ని రోజులు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటూ వచ్చేవాడు అకిరా నందన్. అయితే రేణు దేశాయ్ మాత్రం అకిరా నందన్ ని ఎవరైనా పవన్ కళ్యాణ్ కొడుకు అని పిలిస్తే ఫైర్ అయిపోతుంది. అతను నా బిడ్డ మరోసారి అలా పిలవకండి అంటూ ఫ్యాన్స్ పై విరుచుకుపడడం ఎన్నో సార్లు మనం చూసాము.

పవన్ కళ్యాణ్ కొడుకు అన్న తర్వాత ప్రతీ ఒక్కరికి అతనిని చూడాలనే ఆత్రుత ఉంటుంది. కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానుల్లో కూడా ఈ ఆత్రుత ఉండడం సర్వసాధారణమైన విషయం. అతని తల్లి సోషల్ మీడియా లో ఉన్నప్పుడు కచ్చితంగా మా అన్న కొడుకు ని చూపించండి అని అనడం సహజమే. దానికి ఆమె చాలా సార్లు ఫైర్ అయిపోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తిట్టడం అనేది,ఆమె ఓవర్ యాక్షన్ కి నిదర్శనం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే రీసెంట్ గా రేణు దేశాయ్ తన కొడుకు అకీరానందన్ తో కలిసి అమెరికాలోని ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ని సందర్శించింది.

నూనూగు మీసాలు, గెడ్డం తో అకిరా ని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇంత అందం గా ఉన్నదేంటి అని, ఈ ఫోటోని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఈ ఫొటోలో తన మనవుడు తో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా ఉన్నాడు అని పోస్ట్ చేసాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది, రాఘవేంద్ర రావు గారు అకిరా నందన్ ని పవన్ కళ్యాణ్ కొడుకు అని పిలవడం రేణు దేశాయ్ కి అసలు నచ్చలేదు. వెంటనే రాఘవేంద్ర రావు కి ఫోన్ చేసి డిలీట్ చెయ్యమని చెప్పింది. పోస్ట్ చేసి రెండు నిముషాలు కూడా కాకముందే రాఘవేంద్ర రావు ఆ ఫోటో ని డిలీట్ చేసాడు. రేణు దేశాయ్ చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.