Renu Desai : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంత బిజీ గా ఉన్నాడో మన అందరం చూస్తూనే ఉన్నాం. మరోపక్క ఆయన పూర్తి చెయ్యాల్సిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయనకీ వీటికే ఊపిరి తీసుకోలేనంత బిజీ ఉంది. అందుకే ఆయన కనీసం తన నిర్మాతలకు కూడా అప్పాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు. కానీ తన మాజీ భార్య రేణు దేశాయ్ కి మాత్రం అప్పోయింట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్, ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కి చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్న ఆమె రీసెంట్ గా సినిమాల్లోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇదంతా పక్కన పెడితే నిన్న ఆమె తెలంగాణ ఫారెస్ట్, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి అయినా కొండా సురేఖ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రేణు దేశాయ్ కి ఆమె బట్టలు, బంగారు గొలుసు పెట్టి సత్కరించారు. ఈ క్రమంలోనే ఆమె వచ్చే వారం లో ఆనం రామనారాయణరెడ్డి ని కలవబోతుంది. అందులో భాగంగానే ఆమె ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలవబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని కలబోతుండడం ఇప్పుడు పెద్ద చర్చలకు దారి తీసింది. విడాకులు తర్వాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ చాలా సార్లు కలిశారు. కానీ అది కేవలం పిల్లలు కోసం మాత్రమే.
కానీ ఇప్పుడు ఆమె మొట్టమొదటిసారి వ్యక్తిగతంగా కలవబోతుంది. కలిసిన తర్వాత ఫోటోలు, వీడియోలు కూడా మీడియా కి రానున్నాయి. నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలతో ఫుల్ బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కి అప్పోయింట్మెంట్ ఇవ్వలేకపోయారట. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఆమెకి అప్పోయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుసుంది. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఆగస్టు నెల నుండి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటారని టాక్ వినిపిస్తుంది. ఆయన హీరో గా నటిస్తున్న ఓజీ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది.