Renu desai : పవన్ కళ్యాణ్ గెలుపు.. రెండో పెళ్లిపై సంచలన నిర్ణయం తీసుకున్న రేణుదేశాయ్

- Advertisement -

Renu desai : రేణుదేశాయ్ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన కెరీర్లో కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, మోడల్‌గా, హీరోయిన్‌గా మెప్పించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఉమెన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బద్రి, జానీ చిత్రాల్లో కలిసి నటించి ఆయనతో ప్రేమలో పడింది. అనంతరం వీరిద్దరు పెళ్లి చేసుకుని.. అకీరా, ఆద్యలకు తల్లిదండ్రలు అయ్యారు. కొంతకాలం తర్వాత కారణమేంటో తెలియదు కానీ రేణు దేశాయ్ – పవన్ కల్యాణ్ అర్థాంతరంగా విడిపోయారు. పవన్ కల్యాణ్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఈమె మాత్రం తన పిల్లలు అకీరా, ఆద్యల ఆలనపాలన చూసుకుంటూ ఒంటరిగానే లైఫ్ లీడ్ చేస్తుంది. పవన్ తో విడాకుల అనంతరం రేణు దేశాయ్ మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఆ వ్యక్తి ఎవరనేది తెలియనప్పటికీ వారి నిశ్చితార్థం మాత్రం క్యాన్సిల్ చేసుకుంది. అయితే పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు పెట్టడం, ఇంటర్వ్యూలో పాజిటివ్‌గా మాట్లాడడం కనిపించింది.

తాజాగా రేణు దేశాయ్ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ మరో మూడేళ్ల తర్వాత చేసుకుంటానని బహిరంగంగానే చెప్పేసింది. అప్పట్లో తాను ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం కూడా చెప్పింది. ఆ సమయంలో అకీరా, ఆద్యలది చాలా చిన్న వయస్సు. నేను ఆ సమయంలో రెండో పెళ్లి చేసుకుంటే నా భర్తకు టైం కేటాయించాల్సి వస్తది. అప్పుడు నా పిల్లలు అకీరా, ఆద్య ఒంటరి అయిపోతారు. ఇప్పటికే వారు తన తండ్రకి దూరంగా ఉంటున్నారు. మళ్లీ నేను పెళ్లి చేసుకుంటే వారు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మరో మూడేళ్లలో వారు కాలేజ్ కు వెళ్తారు. అప్పుడు ఫ్రెండ్స్, కాలేజ్ అనే మరో కొత్త లోకాన్ని చూస్తారు. అప్పుడు పెద్దగా పేరెంట్స్ మీద ఆధారపడరు. అందుకే ఇన్ని సంవత్సరాలు అకీరా, ఆద్యల కోసం పెళ్లి చేసుకోకుండా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నాను’’ అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక గతంలో రేణు తన పెళ్లి విషయంలో అకీరా, ఆద్యలు పాజిటివ్‌గా ఉన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here