Renu desai : పవన్ కళ్యాణ్ తో విడాకుల అనంతరం కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైన రేణు దేశాయ్ ఇటీవల కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలెట్టింది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో సమాజంలో మహిళలలను చిన్న చూపు చూస్తారని, వాళ్లు కూడా మగాళ్ళతో సమానమేనని, వాళ్లకంటూ ఎన్నో కలలో ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై ఓ సీనియర్ జర్నలిస్ట్ రేణు దేశాయ్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలకి సంబంధించిన కొన్ని క్లిప్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు దేశాయ్ పలు సుదీర్ఘ పోస్టులు పెట్టింది.
“సుమారు 30 యాడ్స్ లో నటించాను. తెలుగు, తమిళంలో మూడు సినిమాలు చేశాను. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ నేనే. స్కూల్, కాలేజీలో మెరిట్ స్టూడెంట్ ని. టీవీ షోలో సక్సెస్ఫుల్ జడ్జి. సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉమెన్. డైరెక్టర్, ప్రొడ్యూసర్… ఇలాంటి ఘనతలు సాధించిన నా గురించి నాకు తెలియని ఓ వ్యక్తి నా జీవితంలో నేను ఏం చేయాలనేది చెబుతున్నాడు. అంకుల్ మీరు నా నామస్మరణం చేసి సంపాదిస్తున్నారు. నా పేరు వల్ల మీకు కొంత డబ్బులు వస్తున్నాయంటే అందుకు నేను సంతోషిస్తాను. నీ ఓన్ టాలెంట్, ఎక్స్పీరియన్స్ తో నువ్వు డబ్బులు సంపాదిస్తే అది చాలా బాగుంటుంది.
కానీ సింపుల్ గా చైర్ లో కూర్చుని ఫిలిం యాక్టర్స్ గురించి గాసిప్స్ చెబుతూ డబ్బులు సంపాదిస్తున్నావ్. అంకుల్, మీ ఈ సమయాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించండి. లేకుంటే ఆ దేవుడి నామస్మరణ చేయండి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మీ అనుభవం ఇలా ఉందంటే జాలి వేస్తుంది. అంకుల్, నేనెప్పుడూ మిమ్మల్ని కలవలేదు. నా గురించి మీకేం తెలీదు. కానీ నా గురించి ఇంటర్వ్యూలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు దుర్గాదేవి, కాళీమాత వంటి శక్తివంతులని భావించే మన కల్చర్ లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్లు వేస్ట్ అంటూ మీలాంటి వాళ్ళు ఈ సొసైటీకి నేర్పిస్తున్నారు” అంటూ మరో పోస్టులో రాసుకొచ్చింది రేణు దేశాయ్.