Renu Desai : చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో రేణు దేశాయ్ పేరు బలంగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా ఈమె సోషల్ మీడియా లో మంచి పాపులారిటీ ని సంపాదించింది, కానీ ఇప్పుడు ఆమె పేరు ఈ రేంజ్ లో ట్రెండ్ అవ్వడైకి కారణం , మళ్ళీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే కారణం అని అంటున్నారు. ‘జానీ’ చిత్రం తర్వాత నటనకి దూరమైన రేణు దేశాయ్ , మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత రవితేజ హీరో గా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా కమర్షియల్ గా యావరేజి గా నిలిచినప్పటికీ, రేణు దేశాయ్ పాత్రకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, భవిష్యత్తులో మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తాను అంటూ రేణు దేశాయ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది.
ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ కి మంచి సామాజిక స్పృహ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. తనకి తోచినప్పుడల్లా నలుగురికి సహాయం చెయ్యాలని చూసే గొప్ప మనసు ఉన్న వ్యక్తి రేణు దేశాయ్. సోషల్ మీడియా లో ఇప్పటి వరకు అలా ఎంతో మందికి ఆర్ధిక సహాయం చేసింది. ఎంతో మంది పిల్లలను చదివించింది కూడా, పవన్ కళ్యాణ్ లో ఉన్న సేవా గుణం ఈమెలో కూడా మెండుగా ఉంటాయి.
అయితే రీసెంట్ గా రేణు దేశాయ్ మూగజీవాల పట్ల చూపించిన ప్రేమ నెటిజెన్స్ మనసుల్ని కదిలించేసింది. ఈ మూడు కుక్క పిల్లలకు అర్జంటుగా ఆపరేషన్ చెయ్యాల్సి ఉంది, అందుకోసం 50 వేలు ఖర్చు అవుతుంది. నా వంతుగా నేను 30 వేల రూపాయిలు సర్దాను, ఇక మీ వంతుగా ఎంతో కొంత ఇవ్వండి అంటూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. కనీసం వంద రూపాయిలు అయినా పంపండి అంటూ ఆమె పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.