Renu Desai : సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ మాజీ భార్య గా ఈమెకి ఉన్న క్రేజ్ మరియు పాపులారిటీ మామూలుది కాదు. ఆయనతో విడిపోయిన కూడా ఈమెని అభిమానులు వదినా అని పిలవడం మాత్రం మానలేదు. కానీ ఆమెకి అసలు అలా పిలవడం ఇష్టం ఉండదు. చాలా మంది అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎవరైనా నెగటివ్ కామెంట్స్ చేసినా కూడా ఈమె నుండి రియాక్షన్ చాలా బలంగా ఉండేది.

విడాకులు తీసుకున్న కొత్తల్లో ఈమెపై సోషల్ మీడియా లో తీవ్రమైన నెగటివిటీ ఉండేది. అప్పట్లో ఈమెకి ఇంస్టాగ్రామ్ తో పాటుగా ట్విట్టర్ కూడా ఉండేది. కానీ నెగటివిటీ ని తట్టుకోలేక ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసింది. ఇకపోతే చాలా కాలం తర్వాత ఈమె ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం ద్వారా మరోసారి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రం నిన్న గ్రాండ్ గా అన్నీ ప్రాంతీయ భాషల్లో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. రేణు దేశాయ్ పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు ముందు ఆమె అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ లో సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ చేసేవారిపై చాలా ఘాటుగా సమాధానం చెప్పింది.

ఆమె మాట్లాడుతూ ‘పబ్లిక్ స్పేస్ లో ఉన్న ఒక వ్యక్తి నచ్చకపోతే మామూలుగా చెప్పొచ్చు. కానీ కొంతమంది హద్దులు దాటి మాట్లాడడం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించినవే. ఒక రాత్రికి వస్తావా , డబ్బులిస్తాను అని ఒకడు నా ఇంస్టాగ్రామ్ లో కామెంట్ చేసాడు. అది వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం, ఒకవేళ నా కొడుకు అకిరా నందన్ ఎవరినైనా అలా మాట్లాడితే నేను చెప్పు తీసుకొని కొడుతాను. అకిరా అలా మాట్లాడే క్యారక్టర్ కూడా కాదు,నేను అలా పెంచాను అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.