Renudesai : పవన్ కూతురుని ఏడిపించిన కేటుగాళ్లు.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన రేణుదేశాయ్

- Advertisement -

Renudesai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా అందరికీ పరిచయమే. ఇటీవల కాలంలో తనపై, తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్‌కి గత కొన్ని రోజులుగా గట్టిగా సమాధానమిస్తున్నారు. అయినా సరే కొంతమంది పోకిరీలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపడం లేదు. దీంతో తన ఇన్‌స్టా అకౌంట్ కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేశారు రేణూ దేశాయ్. అయితే తాజాగా మరోసారి ఈ ట్రోలర్స్, మీమ్స్ పేజీల అడ్మిన్‌ల గురించి సుదీర్ఘంగా ఓ పోస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవాతో అకీరా, ఆద్య కలిసి తీసుకున్న ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేసిన ట్రోలర్స్‌పై రేణు విరుచుకుపడ్డారు. వీళ్లు చేసే ట్రోల్స్ వల్ల తన కూతురు ఆద్య ఎంతగానో ఏడ్చిందంటూ రేణు ఎమోషనల్ అయ్యారు. మీకు కుటుంబాలు లేవా అంటూ ప్రశ్నించారు.

“అసలు మీకు ఎమోషన్స్ అనేవే లేవా? ఈ ఫొటోను నేను క్రాప్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ జోకులు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తారా? మీకు కూడా కుటుంబం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నిజంగా మనషులు ఇంతలా జంతువుల్లా ఎలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు ఉదయం ఒక చెత్త మీమ్ పేజ్ ఇన్‌స్టాలో తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన ఓ పోస్ట్ చూసి నా కూతురు ఆద్య ఏడ్చింది. మీరు సెలబ్రెటీలు, రాజకీయ నేతల కుటుంబాలపై జోకులు వేస్తారు. కానీ మీకు కూడా అమ్మ, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారు కదా. కేవలం చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని.. సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా? నా కూతురు ఈరోజు ఎంత బాధపడిందో ఓసారి గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఆమె ఏడుపు మీకు తగులుతుంది. ఆ కర్మ మీరు అనుభవిస్తారు. మాపై ట్రోల్స్ చేసిన మీమ్ పేజ్ అడ్మిన్‌లకి ఒక తల్లి ఇచ్చే శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ పెట్టే ముందు ఒక 100 సార్లు నేను ఆలోచించాను. కానీ నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయాను.” అంటూ రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు.

- Advertisement -

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు రేణూ దేశాయ్, తన పిల్లలపై ఇష్టమొచ్చినట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై ఓపిక ఉన్నంత వరకూ పోరాడారు రేణు దేశాయ్. ఇక వాళ్ల పాపాన వాళ్లని వదిలేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ ఈరోజు తన కూతురి కన్నీళ్లకి కారణం వారు అవ్వడంతో తట్టుకోలేక మరోసారి సుధీర్ఘ పోస్ట్ పెట్టారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here