Bigg Boss 8 కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మరో 45 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన లోగో వీడియో ని విడుదల చేసారు. ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ జాబితా కూడా దాదాపుగా ఖరారు అయ్యింది, ఆగస్టు మొదటి వారం లో మెయిన్ ప్రోమో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత 5 సీజన్స్ నుండి అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్ కి ప్రేక్షకులకు కాస్త కొత్తదనం కోసం వేరే హీరో ని తీసుకుంటారేమో అని అనుకున్నారు. నాగార్జున కుదిరించుకున్న 5 సీజన్ల ఒప్పందం గడువు పూర్తి అవ్వడమే అందుకు కారణం. అయితే ఇప్పుడు మరో 5 సీజన్స్ కి కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని ఒప్పందం చేసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.
ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ కోసం నాగార్జున ఒక్కో ఎపిసోడ్ కి ఛార్జ్ చెయ్యబోతున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్కో ఎపిసోడ్ కి ఆయన 50 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారట. ఇది ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ హోస్ట్ కూడా ఛార్జ్ చెయ్యని రేంజ్ రెమ్యూనరేషన్ అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓవరాల్ గా నాగార్జున కి సంబంధించి 30 ఎపిసోడ్స్ ఉంచొచ్చు. ఆ 30 ఎపిసోడ్స్ కి కలిపి 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని నాగార్జున అందుకోబోతున్నారన్నమాట. ప్రస్తుతం నాగార్జున ఒక్కో సినిమాకి 7 నుండి 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారు.
కొన్ని సినిమాలకు నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కూడా ఆయనకీ రాదు. ఒక్కో సినిమా ఆయన పూర్తి చెయ్యాలంటే ఆరు నెలల సమయం మినిమం పడుతుంది. కానీ నాగార్జున కి ఇక్కడ బిగ్ బాస్ షో ద్వారా కేవలం మూడు నెలల్లో 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ వస్తుంది. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఇకపోతే ప్రస్తుతం నాగార్జున తమిళ హీరో ధనుష్ తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘కుబేర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ అంటున్నారు. బంగార్రాజు హిట్ తర్వాత నాగార్జున నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.