Puri Jagannadh : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఏ తప్పు చెయ్యకపోయినా కొంతమంది కొన్ని అభియోగాలను ఎదురుకున్నారు. కేవలం రూమర్స్ కారణంగా చేత తమ ప్రతిష్టకి భంగం కలిగించుకున్నారు. అలాంటి వారిలో పూరి జగన్నాథ్, తరుణ్ లు ఉన్నారు. వీళ్లిద్దరు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా, విక్రయిస్తున్నారు అంటూ సోషల్ ఎక్సయిజ్ శాఖ 2018 వ సంవత్సరం ఈ ఇద్దరి సెలబ్రిటీస్ తో పాటుగా పలువురి టాలీవుడ్ సెలబ్రిటీస్ ని విచారించి కోర్టు లో కేసు వేసింది.
అయితే తరుణ్, పూరి జగన్నాథ్ శరీరం లో డ్రగ్స్ కి సంబంధించిన ఎలాంటి ట్రేస్లు లేవని నాంపల్లి హై కోర్ట్ నిన్న వీళ్లిద్దరి కేసులను కొట్టి పారేసింది. ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన నివేదిక ప్రకారం పూరి, తరుణ్ కేసులతో పాటుగా మరో నాలుగు కేసులను సరైన ఆధారాలు లేని కారణంగా కోర్టు కేసులను కొట్టిపారేసింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
ఎలాంటి తప్పు చెయ్యకుండా ఇన్ని రోజులు డ్రగ్స్ తీసుకున్నారు అనే అభియోగం ని పూరి జగన్నాథ్, తరుణ్ ఎదురుకోవడం దురదృష్టకరం అని నెటిజెన్స్ ఫీల్ అవుతున్నారు. కానీ ఎట్టకేలకు చివరికి నిజమే గెలిచిందని, ఈ అభియోగం నుండి బయట పడినందుకు సంతోషం గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. తరుణ్ కి హైదరాబాద్ లో అనేక పబ్స్ ఉన్నాయి. అందుకే అతని పై సోషల్ మీడియా లో అనేక రూమర్స్ అప్పట్లో చక్కర్లు కొట్టేవి.
ఆ రూమర్స్ కారణంగానే తరుణ్ డ్రగ్స్ తీసుకున్నాడు అనే అనుమానంతో అతన్ని విచారించారు. అలాగే పూరి జగన్నాథ్ కూడా పార్టీ కల్చర్ కి బాగా అలవాటు పడిన సెలబ్రిటీ. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన కేవ్ ఉంటుంది. విశ్రాంతి సమయం లో ఆయన తన టీం తో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తాడు. అందుకే ఆయన మీద కూడా ఇలాంటి పుకార్లు పుట్టాయి. ఇప్పుడు ఈ పుకార్లన్నటికీ చెక్ పడింది.