Regina : టాలీవుడ్ లో అందం మరియు యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ కూడా సరైన గుర్తింపు దక్కని హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. వారిలో రెజీనా కూడా ఒకరు. ఈమె కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ ద్వారానే ఆడియన్స్ ని పలకరించింది. ఆ తర్వాత సుధీర్ బాబు హీరో గా పరిచయం అవుతూ చేసిన ‘శివ మనసులో శృతి’ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా మారింది.
ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా కూడా రెజీనా కి టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వచ్చాయి. మీడియం రేంజ్ హీరోలందరికీ ఆమెనే ఛాయస్ అయ్యింది. కానీ కొత్త హీరోయిన్స్ రాక వల్ల ఈమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది. చిన్నగా అవకాశాలు కూడా కోల్పోయింది. అలాంటి సమయం లోనే ఈమె చేతికి వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకుంది. కానీ ఇప్పుడు ఆమె లేడీ విలన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయిపోయింది.
7 అనే చిత్రం ద్వారా మొట్టమొదటిసారి నెగటివ్ రోల్ లో కనిపించిన రెజీనా, ఆ తర్వాత వరుసగా ‘ఎవరు’ మరియు ‘చక్ర’ వంటి చిత్రాలలో నెగటివ్ రోల్స్ చేసింది. ఇప్పుడు రీసెంట్ గా తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో అవకాశం వచ్చింది, ఈమె జాతకం మారిపోయింది అనుకుంటే, అందులో కూడా ఆమె నెగటివ్ రోల్ లో కనిపించబోతుంది. ఇలా యంగ్ హీరోయిన్స్ లో ఇన్ని నెగటివ్ రోల్స్ చేసిన ఏకైక హీరోయిన్ రెజీనా మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పెద్ద స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతుంది అని ఆమె అభిమానులు ఆశిస్తే, ఆమె కెరీర్ ఇలా యూ టర్న్ తీసుకుంది. ఇది నటిగా ఆమెకి సంతృప్తి ఇవ్వోచ్చేమో కానీ, ఆమె అభిమానులకు మాత్రం కాస్త నిరాశే అని చెప్పాలి. డబ్బుల కోసం ఇలా రెగ్యులర్ గా నెగటివ్ రోల్స్ చెయ్యొద్దు అని ఆమె అభిమానులు సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి అడుగుతున్నారు.