ప్రస్తుతం అనుష్క పేరు టాక్ ఆఫ్ ది ఇండసస్ట్రీగా మారింది. నిశ్శబ్దం సినిమా తర్వాత స్వీటీ సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. ఇక మధ్యలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఆమె ఇక సినిమాలు చేయదని, కొంతమంది అంటే అనుష్క పెళ్లి చేసుకోబోతుంది.. అందుకే సినిమాలకు దూరమైందని ఇంకొందరు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆమె బరువు పెరగడం వల్లనే సినిమాలకు దూరమైందని ట్రోల్స్ చేశారు.ఇక వీటన్నింటికి చెక్ పెడుతూ అనుష్క ఈ ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నవీన్ పోలిశెట్టి వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా మారాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అభిమానులు అందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ వారికి నిరాశనే మిగిలింది. ప్రమోషన్స్ విషయంలో అనుష్క ఒక కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఆమె ప్రమోషన్స్ లో బయటికి కనిపించేలాగా అయితే పాల్గొనదని తెలుస్తుంది. అంటే మీడియా ముందుగానీ, కెమెరా ముందుగానీ ప్రమోషన్స్ చేస్తూ అనుష్క కనిపించదట.

వెబ్ ఇంటర్వ్యూస్, ఎఫ్ఎం చాట్, ఫోన్లో మాట్లాడడం ఇలాంటివి చేస్తుందట. ఇక అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క రాకపోవడం వల్లనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేశారని తెలుస్తుంది. దీంతో అభిమానుల్లో చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అనుష్క ఎప్పుడు ఇలా చేయలేదు.. కానీ, మొట్టమొదటిసారి ఆమె ప్రమోషన్స్ రాకపోవడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అయితే అనుష్క బరువు పెరగడం వలనే ఆమె మీడియా ముందుకు రాలేకపోతుందని, ఇంటర్వ్యూ చేస్తే ట్రోల్స్ చేస్తారని భయంతోనే స్వీటీ ఇలా చేస్తుందని చెప్పుకొస్తున్నారు.