బిగ్ బాస్ 7 తెలుగు షోకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ రియాల్టీ షో ఆదివారం (సెప్టెంబర్ 3) ప్రారంభం కాబోతోంది. అయితే ఇప్పటి వరకూ ఈసారి హౌజ్ లోకి రాబోతున్న కంటెస్టెంట్లపై క్లారిటీ రాలేదు. తాజాగా ఓ బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. హాట్ మామ్ అండ్ డాటర్ జోడీ సురేఖ వాణి, సుప్రీత రావడం లేదట. ఇది నిజంగా అభిమానులను నిరాశకు గురి చేసేదే.

ఈ ఇద్దరు తల్లీకూతుళ్లు బిగ్ బాస్ హౌజ్ లోకి రాబోతున్నట్లు చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలతో సందడి చేసే సురేఖ వాణి, సుప్రీత హౌజ్ లోకి వస్తే ఆ మజానే వేరుంటుందని చాలా మంది భావించారు. కానీ చివరి నిమిషంలో వీళ్లు రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లు తప్పుకోవడానికి కారణం ఏంటన్నది మాత్రం తెలియలేదు. మొదట్లో తమకు అసలు బిగ్ బాస్ నుంచి ఆఫరే రాలేదని వీళ్లు చెప్పినా.. ఈ షోకి వెళ్తే ఎలాంటి నెగటివ్ ఇమేజ్ వస్తుందో అన్న ఆందోళన ఈ తల్లీకూతుళ్లలో ఉన్నట్లు తెలిసింది.

ఇప్పటి వరకూ బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రిటీలు పాజిటివ్ గా కంటే నెగటివ్ గానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పటికే ఏడో సీజన్ కంటెస్టెంట్ల లిస్ట్ మొత్తాన్ని బిగ్ బాస్ టీమ్ ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. కొంతకాలంగా వినిపిస్తున్న పేర్లలో కొందరు లేకపోవడం, మరికొందరు వెనకడుగు వేయడం జరుగుతున్నాయి. అయితే ఎప్పటిలాగే షో గ్రాండ్ లాంచ్ సమయం వరకూ కంటెస్టెంట్ల పేర్లను గుట్టుగా ఉంచాలని స్టార్ మా ప్రయత్నిస్తోంది.