మాస్ మహరాజా రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్ని లైన్‌లో పెడుతోన్నాడు. ధమాకాతో సోలోగా, వాల్తేర్ వీరయ్య సినిమాతో చిరంజీవితో కలిసి వరుసగా రెండు సార్లు వంద కోట్ల క్లబ్‌లో చేరి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాడు రవితేజ. రావణాసుర ఫెయిల్యూర్‌గా నిలిచిన రవితేజ కు మాస్‌లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా డీసెంట్ ఓపెనింగ్స్‌ను రాబట్టింది.
కాగా రావణాసుర రిజల్ట్‌తో సంబంధం లేకుండా రవితేజ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రావణాసుర వరకు ఒక్కో సినిమాకు 17 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను రవితేజ తీసుకుంటూ వచ్చినట్లు సమాచారం. తాజాగా రవితేజ తన రెమ్యునరేషన్‌ను ఎనిమిది కోట్ల వరకు పెంచినట్లు పెంచినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. రవితేజ ఒకొక్క సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్ వుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రవితేజకు ఏకంగా 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వనుందట.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ రవితేజకు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. అయితే ఇది ఒక సినిమా కోసం కాదు. పీపుల్స్ మీడియా సంస్థ రవితేజతో నాలుగు సినిమాలు చేస్తున్నారట. ఇందుకోసం 100కోట్ల రెమ్యునరేషన్ కు ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ హీరో వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేస్తోన్నాడు రవితేజ. వాస్తవ ఘటనల ఆధారంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతంది. అలాగే కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ మూవీలో నటిస్తోన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది.