Ravanasura Movie Trailer : మాస్ మహారాజ రవితేజ జోరు మామూలు రేంజ్ లో లేదు,గత ఏడాది ‘ధమాకా’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న రవితేజ,ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ తో మరో భారీ హిట్ ని అందుకున్నాడు.అలా వరుసగా రెండు సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న రవితేజ, ఇప్పుడు రావణాసుర సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.వచ్చే నెలా 7 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ తో ఆ అంచనాలు పదింతలు రెట్టింపు అయ్యాయి.కచ్చితంగా రవితేజ కెరీర్ లో ఈ చిత్రం మరో సూపర్ హిట్ అవుతుంది అనే ఫీలింగ్ ని కలిగించింది ఈ ట్రైలర్.ఒకసారి సంక్లుప్తంగా ఈ ట్రైలర్ ఎలా ఉందో వివరంగా ఈ రివ్యూ లో చూద్దాము.

రవితేజ నుండి ఆడియన్స్ మరియు అభిమానులు మాస్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ ని కూడా ఆశిస్తారు. ‘రావణాసుర’ టైటిల్ ని చూసి ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుందేమో అని ఫ్యాన్స్ అనుకున్నారు.కానీ ట్రైలర్ చూసాక ఇది అవుట్ & అవుట్ రవితేజ మార్కు సినిమా అని అర్థం అయిపోయింది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ‘కిక్’ సినిమాలోని రవితేజ ఒక్కసారి కళ్ళముందు కనపడినట్టు అయ్యింది.ఆయన క్యారక్టర్ ని అంత ఆసక్తికరంగా తీర్చి దిద్దాడు సుధీర్ వర్మ. ట్రైలర్ తోనే సినిమా కథ మీద ఒక అమర్చనకి రావొచ్చు, ఇందులో రవితేజ ఎందుకు సీరియల్ కిల్లర్ గా మారి హత్యలు చేస్తున్నాడు.

ఆ హత్యలన్నీ నిజంగా ఆయనే చేస్తున్నాడా అనేది ఆసక్తికరమైన పాయింట్ గా చూపించాడు.ఇందులో అక్కినేని సుశాంత్ ఒక కీలక పాత్ర పోషించగా ఫైరా అబ్దుల్లా, మేఘ ఆకాష్, అను ఇమ్మానుయేల్ మరియు దక్ష నాగర్కర్ హీరోయిన్లు గా నటించారు. వీరిలో ఎవరు మెయిన్ హీరోయిన్ అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో ఉత్కంఠని కలిగించిన ఈ చిత్రం విడుదల తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.