Ravi Teja : ఇండస్ట్రీ లో ఎలాంటి అవకాశాలు లేని సమయం లో తనకి అవకాశం ఇచ్చి మొట్టమొదటి చెక్ ని ఇచ్చిన హీరో నాగార్జున గారు మాత్రమే అని రవితేజ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. రవితేజ కి నాగార్జున విషయం లో ఇప్పటికీ ఆ కృతజ్ఞత ఉంది. ఆ కృతజ్ఞతని మరోసారి నిరూపించుకున్నాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఈగల్’.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున విడుదల చెయ్యడానికి సిద్ధం అయ్యారు మేకర్స్. అందుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. ఈ సినిమా విడుదలైన పక్క రోజే నాగార్జున ‘నా సామి రంగా’ చిత్రం విడుదల అవుతుంది. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి పట్టుమని 100 స్క్రీన్స్ కూడా దొరకలేదు.

దీంతో నాగార్జున స్వయంగా రవితేజ కి ఫోన్ చేసి ‘మా సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి విడుదలయ్యే కంటెంట్. సంక్రాంతి కాకుండా ఇక ఎప్పుడు వచ్చినా కూడా ఈ చిత్రం అనుకున్న స్థాయిలో క్లిక్ అయ్యే అవకాశం లేదు. ఈగల్ సంక్రాంతి కాకపోయినా, ఎప్పుడొచ్చినా ఆడే కంటెంట్ మూవీ. కానీ మా సినిమాకి థియేటర్స్ దొరకడం లేదు, అత్యధికంగా మీ సినిమా నిర్మాతలే థియేటర్స్ మొత్తం హోల్డ్ చేసారని నాకు రావాల్సినవి అని తెలిసింది.

ఏదైనా ఛాన్స్ ఉంటే సంక్రాంతి నుండి తప్పుకోండి’ అని రిక్వెస్ట్ చేసాడట. నాగార్జున రిక్వెస్ట్ చేసేలోపు క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తన నిర్మాతలకు సినిమాని వాయిదా వెయ్యమని చెప్పాడట రవితేజ. సంక్రాంతి సీజన్ లో వచ్చి ఉంటే ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి ఉండేది. అలాంటి అవకాశాన్ని రవితేజ తృణపాయం లో వదులుకున్నాడు అంటే నాగార్జున అంటే ఆయనకీ ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు.
