Tiger Nageswara Rao : మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వర రావు’ రీసెంట్ గానే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. స్టూవర్టుపురం దొంగ ‘టైగర్ నాగేశ్వర రావు’ నిజ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని డైరెక్టర్ వంశి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా విడుదలకు ముందు మూవీ టీం ప్రొమోషన్స్ ఏ రేంజ్ లో చేసారో మన అందరికీ తెలిసిందే.
అయితే కొన్ని కొన్ని సార్లు ఎడిటింగ్ సరిగా లేకపోవడం వల్ల , సినిమాల ఫలితాలు తారుమారైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ‘టైగర్ నాగేశ్వర రావు’ విషయం లో కూడా అదే జరిగింది. విడుదలైనప్పుడు ఈ సినిమా రన్ టైం 3 గంటలకు పైనే ఉంది. టాక్ బాగున్నప్పటికీ కూడా ఈ రన్ టైం వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి కదలలేదు. ఫలితంగా ఆశించిన స్థాయి వసూళ్లు రావడం లేదు.
ఈ విషయాన్నీ పసిగట్టిన మూవీ టీం, వెంటనే ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రాన్ని మూడు గంటల నుండి రెండు గంటల 37 నిమిషాలకు కుదించారు. అంటే దాదాపుగా అరగంట సినిమాని లేపేశారు అన్నమాట. కానీ ఇప్పుడు అవన్నీ చేసి ఏమి ప్రయోజనం?, ఒక్కసారి జనాల్లో టాక్ వెళ్ళింది అంటే అది మైండ్ లో అలాగే ఉండిపోతుంది, ముందే ఈ పని చేసి విడుదల చేసి ఉంటే ఈరోజు వసూళ్లు వేరేలా ఉండేది అని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక నేడు ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో కూడా రవితేజ ఇదే విషయం గురించి మాట్లాడాడు. టైగర్ నాగేశ్వర రావు సక్సెస్ సాధించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. కానీ చిన్న చిన్న పొరపాట్లు వల్ల కాస్త డివైడ్ రెస్పాన్స్ వచ్చింది మొదటి రోజు. సినిమా రన్ టైం విషయం మైనస్ అవుతుందేమో అని నాకు అనిపించేది, కానీ మా డైరెక్టర్ కథకి కచ్చితంగా అవసరం అని పెట్టాడు, కానీ ఆడియన్స్ అది నచ్చలేదు, అందుకే ట్రిమ్ చేసాం, ఇప్పుడు రెస్పాన్స్ అదిరిపోయింది, వసూళ్లు కూడా బాగా పెరిగాయి అంటూ రవితేజ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.