Nagma : భోజ్ పూరి నటుడు ఎంపీ రవి కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలో మద్దాల శివారెడ్డి పాత్రలో రవి కిషన్ నటన హైలెట్ గా నిలిచింది. అలాగే మెగా హీరో నటించిన సుప్రీమ్ సినిమాలో కూడా విలన్ గా తన నటన ఆకట్టుకుంటుంది. తాజాగా రవికిషన్ నగ్మాతో తనకున్న ఎఫైర్ గురించి ఓపెన్ అయ్యాడు.. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

రవి కిషోన్ నగ్మా హిట్ పెయిర్ గా నిలిచారు. వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని జోరుగా ప్రచారం జరిగింది. రవికిషన్ భార్య ప్రీతి శుక్ల ఈ వ్యవహారంపై స్పందించడంతో.. వీరిద్దరి మధ్య దూరం పెరిగి బ్రేకప్ అయిందని వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి.. ఈ విషయంపై నగ్మా కానీ రవి కిషన్ కానీ ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించలేదు. దాంతో ఈ విషయం పై తాజాగా మొట్టమొదటిసారి రవికిషన్స్ స్పందించడంతో మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది..
నగ్మా తో మీ ఎఫైర్ గురించి మీరు ఏమంటారు అని ప్రశ్నించగా.. రవి కిషన్ చెబుతూ.. నేను నగ్మా తో కలిసి చాలా సినిమాలు చేశాను. మాది సూపర్ హిట్ పెయిర్. మేము ఏ సినిమా చేసినా చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అందుకే మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. మేము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే.. నా భార్య ప్రీతి అంటే నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఏమీ లేనప్పటి నుంచి ప్రీతి నన్ను అర్థం చేసుకుంది. నా దగ్గర ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పటివరకు ఆమె నాతో ప్రయాణం చేసింది అంటే.. ఆమె నాకు ఎంతో గౌరవం.
సినిమాల్లోకి వచ్చాక మంచి పేరు వచ్చింది. ఆ తరువాత నేను ఎవరి మాట వినలేదు.. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళమని నా భార్య చెప్పింది. ముందుగా నేను అందుకు ఒప్పుకోలేదు.. కానీ అక్కడ ఉన్న మూడు నెలలు నాలో నేను నిన్ను మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాను.. నన్ను నేను తెలుసుకున్నాను. నా గర్వాన్ని మొత్తం విడిచి పెట్టాను. నాలో ఇంత మార్పు రావడానికి కారణం నా భార్య అంటూ.. రవికిషన్ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.