రాత్రికి వస్తావా అని ఆ హీరోయిన్ సెట్ లోనే అడిగింది. కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు లైంగిక వేధింపులు కొత్తేమి కాదు. చాలా ఏళ్ల నుంచి ఇది కొనసాగుతున్న తంతే. అయితే ఆ మధ్య శ్రీరెడ్డి లైంగిక వేధింపులపై పోరాటం చూసిన తరువాత చాలామంది హీరోయిన్స్ బయటకు వచ్చి, ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే చెప్పడం జరిగింది. హీరో తన బెడ్ రూమ్ లోకి రమ్మన్నాడు అనో, పడుకుంటేనే అవకాశం ఇస్తామని నిర్మాత అన్నాడనో, దర్శకుడు వేధించాడు అనో ఆరోపణలు మనం తరుచుగా ఉంటాం. హీరోయిన్లకు సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు ఎక్కువ అన్నది నిజం.

రవికిషన్ బాలీవుడ్
రవికిషన్ బాలీవుడ్

అయితే తాజాగా ఓ హీరో కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడటం తీవ్ర చర్చలకు దారి తీసింది. భోజ్ పూరి ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద హీరోగా ఉన్న రవికిషన్ బాలీవుడ్, టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం బీజేపీ ఎంపీ కూడా. ‘రేసుగుర్రం’ వంటి సినిమాల్లో నటించిన ఈ నటుడు బాలీవుడ్ లో పేరొందిన ఒక నటి తనని నైట్ కి రమ్మంది అని చెప్పాడు. ఆమె ఉద్దేశం అర్థం అయి అటు పోలేదంటున్నాడు.

రేసుగుర్రం
రేసుగుర్రం

ఆమె పేరు చెప్పను కానీ, ఆమె చేసిన పని చెబుతానంటూ అందరినీ ఆశ్చర్చపరిచాడు. తాను కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ నా దగ్గరికి వచ్చి రాత్రికి మా ఇంటికి కాఫీకి రమ్మని ఆహ్వానించింది. ఆమె ప్రవర్తన మొదటి నుంచి తనకు అనుమానమేనని ఆయన అన్నారు. తన అనుమానానికి తగ్గట్లే ఆమె పొద్దునపూట కాకుండా రాత్రికి కాఫీకి పిలవటంతో వెళ్లలేదని చెప్పాడు. ఆమె సినీ పరిశ్రమలో అందరికీ బాగా తెలిసిన హీరోయిన్ అని పేరు చెబితే ఆమె పరువు పోతుందని అందుకే చెప్పడం లేదన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here