Pallavi Prashanth : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలుస్తుంది అని అనిపించుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరిగా రతికా అందరికీ అనిపించింది. అయితే రెండవ వారం నుండి ఆమె తన గేమ్ మీద కంటే ఇతరుల గేమ్ ని సర్వ నాశనం చెయ్యడం వైపే ఫోకస్ పెట్టింది.

మొదటి నుండి ఫుల్ ఫోకస్ గా అద్భుతంగా గేమ్స్ ఆడే కంటెస్టెంట్స్ లో ఒకరిగా పల్లవి ప్రశాంత్ కి మంచి పేరు ఉంది. అతని ఒక సామాన్య రైతు బిడ్డ ఇమేజి తో ఫుల్ ప్రజాధారణ తోనే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాడు. కానీ టాస్కులు ఆడే విషయం లో తన మార్కుని క్రియేట్ చేసుకొని, కచ్చితంగా కప్ కొట్టుకొనే వెళ్తాడు అనే నమ్మకాన్ని అందరిలో కలిగించాడు. అయితే మధ్యలో రతికా తో లవ్ ట్రాక్ నడిపి గ్రాఫ్ ని దెబ్బ తీసుకున్నాడు.

ఈమె ముందుగా అతనితో క్లోజ్ గా లవ్ యాంగిల్ ని మైంటైన్ చేస్తున్నట్టుగా ప్రవర్తించి, అతని వైపు నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాగానే నువ్వు బిగ్ బాస్ కి నాకు లైన్ వెయ్యడానికి వచ్చావా?, లేకపోతే గేమ్ ఆడదానికి వచ్చావా అంటూ ఊహించని ట్విస్టు ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది. అప్పటి నుండి పల్లవి ప్రశాంత్ ఆమెకి దూరం గా ఉంటూ అక్కా అని పిలుస్తూ వచ్చాడు. అక్కా అని పిలిచినందుకు ప్రశాంత్ తల్లిదండ్రులను సైతం తిట్టింది రతికా. ఆమె ప్రవర్తన ని తట్టుకోలేక బయటకి పంపేశారు ఆడియన్స్. బయటకి వెళ్లిన తర్వాత అన్నీ విషయాలను తెలుసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన రతికా మళ్ళీ ప్రశాంత్ గ్యాంగ్ లోనే చేరింది.

ఇన్ని రోజులు మంచిగా వ్యవహరిస్తూ వచ్చిన రతికా నిన్న టాప్ 10 స్థానాల్లో నిల్చునే టాస్కులో మళ్ళీ పల్లవి ప్రశాంత్ కి వెన్నుపోటు పొడిచింది. మొదటి నాలుగు వారాలు నువ్వు అసలు ఏమి ఆడలేదని, రతికా రతికా అంటూ నా చుట్టూ తిరిగావనీ, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు నీకు ప్లస్ అయ్యాయి, నాకు మైనస్ అయ్యి బయటకి వెళ్ళాను అని, ఇక హౌస్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత, నువ్వు శివన్న చెప్పినట్టే ఆడుతున్నావని, నీ సొంత గేమ్ ఆడట్లేదు అంటూ ఏది పడితే అది మాట్లాడింది. దానికి పల్లవి ప్రశాంత్ కూడా తనదైన స్టైల్ లో ఇచ్చి పారేసాడు. ఈ వారం రతికా ఎలిమినేట్ అవుతుందో లేదో చూడాలి.
