Rashmika Mandanna : రష్మిక మందన్న ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే ‘యానిమల్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టింది. రష్మిక చేతిలో ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు ఉన్నాయి. పుష్ప 2 తో పాటు వేరే సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉంది. అయితే గత రెండు రోజులుగా రష్మిక రెమ్యునరేషన్ పెంచేసింది అని వార్తలు వస్తున్నాయి.

యానిమల్ సినిమా భారీ హిట్ అవ్వడంతో ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలకు కాకుండా రాబోయే సినిమాలకు రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది, ఒక్కో సినిమాకు నాలుగు నుంచి అయిదు కోట్ల వరకు అడుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక మందన్న ఈ వార్తలపై స్పందించింది. సోషల్ మీడియాలో ఓ మూవీ పేజీ రష్మిక రెమ్యునరేషన్ పెంచేసినట్టు, 4 – 5 కోట్లు తీసుకుంటున్నట్టు పోస్ట్ చేయడంతో రష్మిక ఆ పోస్ట్ కి రిప్లై ఇచ్చింది. రష్మిక ఆ పోస్ట్ కి రిప్లై ఇస్తూ.. నేను ఆశ్చర్యపోతున్నాను. ఇవన్నీ చూసాక నిజంగానే దీని గురించి ఆలోచించాలనుకుంటున్నాను.

నిర్మాతలని మీరు చెప్పిన రెమ్యునరేషన్ అడుగుతాను. ఒకవేళ నిర్మాతలు ఎందుకు అని అడిగితే, మీడియా ఇలా చెబుతుంది కాబట్టి నేను వారి మాటలకు కట్టుబడి ఉండాలనుకుంటున్నాను, నేనేం చేస్తాను అని చెప్తాను అంటూ సెటైరికల్ గా కౌంటర్ ఇచ్చింది. దీంతో రష్మిక ట్వీట్ వైరల్ గా మారింది. రష్మిక రెమ్యునరేషన్ ఏం పెంచలేదు అని ఈ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేసింది. అయితే సాధారణంగా రష్మిక ప్రస్తుతం కోటి నుంచి రెండు కోట్ల వరకు సినిమా స్థాయిని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.