Rashmika : రష్మిక మందనా పేరుతో ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక ఫుల్ గా ఎక్స్పోజింగ్ చేసినట్లు ఉంది. వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఇది రియల్ వీడియో అనుకున్నారు. కానీ అది ఫేక్ వీడియో అని తేలడంతో సినీ సెలబ్రిటీలు సైతం ఈ వీడియోని చూసి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక డీప్ ఫేక్ వీడియో అంటూ వైరల్ అవుతున్న ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాని 36 గంటల్లోగా తొలగించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావలసి వస్తుందని అన్నారు. ఇక తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన సైతం స్పందించింది. ఇలాంటి ఓ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. కాగా కొందరు ఆకతాయిలు రష్మిక ఫోటోను మార్ఫింగ్ చేసి అసభ్యకర వీడియోను క్రియేట్ చేశారు.
ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపించింది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపై కొందరు నెటిజన్స్ కి అనుమానం వచ్చి అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి సంబంధించిందని తేల్చేశారు. ఆ వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్నింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. అయితే , రష్మిక ఎప్పుడూ పొట్టి బట్టలు వేసుకుని పోస్ట్ లు పెడుతుంటుందనీ అందుకే ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేశారని చెప్పుకుంటున్నారు.