రష్మిక మందన్నా యానిమల్ సినిమా తర్వాత ఈ పేరు మార్మోగిపోతుంది. ఆ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత గీతాగోవిందం సినిమాతో తనదైన స్టైల్ లో హిట్ కొట్టి ఇండస్ట్రీని ఏలేస్తోంది. మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బన్నీ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం కొట్టి.. పాన్ ఇండియా హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన చేసిన పుష్ప సినిమా రష్మిక మందన్నా కెరియర్ ను మలుపు తిప్పింది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక.. శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత రష్మిక ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ఆ సినిమాతో ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా మారిపోయింది . రీసెంట్ గా వచ్చిన యానిమల్ సినిమా కూడా అమ్మడుకు మంచి పేరే తీసుకొచ్చింది. బోల్డ్ పర్ఫామెన్స్ అనిపించింది కానీ.. అందరూ సినిమాని ఎగబడి చూసి 900 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేలా చేశారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్నా.. రీసెంట్ గా వాలెంటైన్స్ డే కి కొద్ది గంటల ముందు అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆమె కొన్ని సెల్ఫీ పిక్స్ కూడా షేర్ చేసింది. ఈ సెల్ఫీ పిక్స్ లో ముద్దు పెడుతున్నట్లు నాటి ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇచ్చింది రష్మిక మందన్నా. అభిమానులతో ఆమె అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది. అయితే వాలెంటైన్స్ డే కదా ఆ సందర్భంగా రష్మిక నుంచి ఏదైనా బిగ్ గుడ్ న్యూస్ వస్తుంది ఏమో అనుకున్నారు జనాలు.
కానీ అలాంటి శుభవార్త ఏమీ రష్మిక నుంచి రాలేదు. రష్మిక మందన్నా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ..‘ మీతొ మాట్లాడి చాలా రోజులైంది.. మీ వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటి? అందరూ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి .. మీతో మాట్లాడితే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది’ అంటూ చాలా సరదాగా వాలెంటైన్స్ డే గురించి అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.