Rashmika Mandanna : రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేషనల్ క్రష్ ప్రస్తుతం చేతి నిండా సినిమాల్లో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంది. అమ్మడు ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తాను పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే అటు బాలీవుడ్ లోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ సైతం రష్మిక పై ఓ స్పెషల్ ఆర్టికల్ రాసుకొచ్చింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ నేషనల్ క్రష్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ చూసి ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ పోస్టు చూసిన నెటిజన్లు కంగారుతో నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అంతగా అభిమానులు కలవర పెట్టిన పోస్ట్ ఏమనుకుంటున్నారా ? నిజమే మరీ.. తన పోస్టుతో అభిమానులకు షాకిచ్చింది రష్మిక. కొద్దిలో చావు నుంచి ఎలా తప్పించుకున్నానో అంటూ రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే..
ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మికకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న ఫైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అదే ఫ్లైట్ లో రష్మికతోపాటు మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరు కలిసి ఫ్లైట్ లో కూర్చున్న ఫోటోను షేర్ చేసింది రష్మిక. “ఈరోజు మేము ఈ విధంగా చావు నుంచి తప్పించుకున్నాము” అంటూ రాసుకొచ్చింది. దీంతో రష్మిక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయ్యింది. నేషనల్ క్రష్ పోస్ట్ పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్లు రష్మిక, శ్రద్ధా దాస్ కలిసి ప్రయాణిస్తోన్న విమానం ముంబై నుంచి హైదరాబాద్ కు వస్తోందని తెలుస్తోంది. అయితే ఫ్లైట్ లో సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత తిరిగి మళ్లీ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇక ఇదే విషయాన్ని రష్మిక పోస్ట్ చేసింది.