Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఆ వీడియోపై సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం స్పందించారు. అయితే, ఆ ఘటన మరువక ముందే మరో వీడియో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డీప్ ఫేక్ రాకాసి కేవలం హీరోయిన్లనే కాదు పొలిటీషియన్లను సైతం వదల్లేదు. మోడీతో సహా పలువురు ప్రముఖులు దీని బారిన పడ్డారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నను మరోసారి దుండగులు టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొన్ని రోజుల క్రితం డీప్ ఫేక్ వివాదంలో చిక్కుకుంది. కొందరు దుండగులు ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసి షాకిచ్చారు. అందులోంచి బయటపడ్డ రష్మిక ఇప్పుడు యానిమల్ సినిమా సక్సెస్ తో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాతో మరోసారి యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది.

దుండగులు మరోసారి ఓ డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. అప్పుడు చేసిన వీడియోకు కొనసాగింపుగా సోషల్ మీడియాలో మరో డీప్ ఫేక్ వీడియో విడుదలైంది. ఇందులో కూడా తన ముఖాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా మార్ఫింగ్ చేయడం గమనార్హం. అయితే ఈసారి మరింత క్లియర్ కట్‌తో ఈ డీప్ ఫేక్ వీడియోను రూపొందించారు. ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తున్నారు. దుండగులపై దుమ్మెత్తి పోస్తున్నారు. దీన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ రష్మిక వరుసగా ఇలాంటివి ఎదుర్కోవడం బాధాకరం అనే చెప్పాలి. మరి వీటిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

తాజాగా రష్మిక మందన్న ‘యానిమల్’ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ పుష్ప 2లో నటిస్తోంది. మరోసారి శ్రీవల్లి సందడి చేసేందుకు రెడీ అవుతుంది. అలాగే ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. దీంతో పాటు రెయిన్ బో అనే సినిమా చేయనుంది. మొత్తానికి ఇప్పుడు రష్మిక రేంజ్ పెరిగిపోయింది. ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్‌గా నిలుస్తోంది.