Rashmika Mandanna నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి తన అందంతో అభిమానుల మనసు గెలిచేసింది. ఏ ఔట్ ఫిట్ లోనైనా క్యూట్ గా కనిపించే ఈ భామ తాజాగా సంప్రదాయంగా చీరకట్టులో సందడి చేసింది. గ్రీన్ కలర్ శారీలో రష్మిక మైమరిపించింది. అచ్చతెలుగు పదహారణాల పడుచుపిల్లలా తన అందంతో మంత్రముగ్ధుల్ని చేసింది.
ఓ ప్రైవేట్ ఈవెంట్ కు రష్మిక చీరకట్టులో హాజరైంది. ఈ భామ అందం చూసి అక్కడికొచ్చిన ఫ్యాన్స్ అంతా మైమరిచిపోయారు. దానికి సంబంధించిన ఫొటోలను రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఇంత మంది అభిమానం పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానంటూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం రష్మిక లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో శ్రీవల్లి అందం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ భామ పుష్ప-2 సినిమా షూటింగుతో బిజీగా ఉంది. ఇదే కాకుండా యానిమల్ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా ఈ భామ చేతిలో ఉంది. ఇక ఇవి కాకుండా ఈ భామ బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. సికిందర్, ఛావ సినిమాల్లో నటిస్తోంది.
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరలోనూ ఈ భామ నటిస్తోంది. తెలుగులో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ లోనూ రష్మిక సందడి చేస్తోంది. ఇలా చేతినిండా ప్రాజెక్టులతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. తరచూ హైదరాబాద్ టు చెన్నై టు ముంబయి వెళ్తూ షూటింగుల్లో పాల్గొంటోంది.