ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన నటి రష్మిక మందన. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ మరియు శాండిల్ వుడ్ సినిమాలలో నటించి తన సత్తా చాటిన రష్మిక, రీసెంట్ గా బాలీవుడ్ లో ‘ఎనిమల్’ చిత్రం తో ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ఆమె ఒక పక్క అందం తో పాటు, మరోపక్క అద్భుతమైన నటి గా బాలీవుడ్ ఆడియన్స్ వద్ద మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘పుష్ప : ది రూల్’ చిత్రం తో పాటుగా, ధనుష్ – నాగార్జున కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటుగా గీత ఆర్ట్స్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాని కూడా చేస్తుంది రష్మిక.

ఇదంతా పక్కన పెడితే రష్మిక మందన ఇండస్ట్రీ లో హీరోలతో పాటుగా, డైరెక్టర్స్ మరియు నిర్మాతలతో కూడా చాలా ఫ్రెండ్లీ గా ఉంటుంది. కానీ రీసెంట్ గా తనకి సూపర్ హిట్ ని అందించిన స్టార్ డైరెక్టర్ తో రష్మిక కి పెద్ద గొడవ జరిగిందట. అప్పటి నుండి ఆ డైరెక్టర్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ని తన మొబైల్ లో బ్లాక్ చేసిందట.

ఈ వివాదం గురించి తెలుసుకున్న నెటిజెన్స్ సోషల్ మీడియా లో రష్మిక వేస్తున్న పోస్టులలో దూరి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ, నోటితో చెప్పుకోలేని విధంగా రష్మిక ఫోటో తో వీడియో మార్ఫింగ్స్ చేస్తూ, ఆమెని టార్చర్ చేస్తున్నారట. దీంతో తనకి అలాంటి కామెంట్స్/ మెసేజిలు పెట్టిన వాళ్ళందరి ఐపీ అడ్రెస్స్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ ని రీసెంట్ గానే ఇచ్చిందట.
