నేషనల్ క్రష్ Rashmika Mandanna బాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తోంది. అయితే నటనలోనే కాదు ఈ బ్యూటీ ఫ్యాషన్ లోనూ బీ టౌన్ పోకడను అలవాటు చేసుకుంది. తాజాగా ఈ భామ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే అలాగే కనిపిస్తోందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ కు వెళ్లాక రష్మిక డ్రెస్సింగ్ స్టైల్ మారిందంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇక తాజాగా రష్మిక ధరించిన ఓ ఔట్ ఫిట్ ను చూసి నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా రష్మిక.. ఓ అవార్డుల వేడుకకు హాజరైంది. ఆ సమయంలో బ్లాక్ డ్రెస్ ధరించింది. బ్లాక్ నెట్ డ్రెస్ లో రష్మిక క్లీవేజ్ షో చేస్తూ థైస్ షోతోనూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. కొందరు ఆమె ఔట్‌ఫిట్ చూసి ఆహా అంటున్నా మరికొందరు మాత్రం ఏడ్చినట్లుంది అని కామెంట్లు చేస్తున్నారు.

‘ఏంటి? రష్మిక ఉర్ఫీని ఫాలో అవుతోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక ఇలా మారిపోయిందేందంటూ తెగ బాధ పడుతున్నారు. ‘అసలు ఈ సెలబ్రిటీలకు ఏమవుతోంది? వీళ్లందరినీ బాయ్‌కాట్ చేసేయాలి. ఆల్‌రెడీ ఫేమస్ అయినవాళ్లు కూడా ఎక్స్‌పోజ్ చేయాల్సిన అవసరం ఏముంది?’ అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి రష్మిక తన ఔట్ ఫిట్ తో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతికి విడుదలైన వారసుడు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘మిషన్ మజ్ను’తో అలరించింది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ చేస్తోంది. పుష్ప-2 సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.

“నటన పరంగా ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురైతేనే మేలు. మొదట ఇంత కష్టమైన పాత్రని నేనెలా చేస్తానా? అనే భయం కలుగుతుంది. ఆ తర్వాత అంతే దీటుగా ఆ సవాళ్లని స్వీకరించి సెట్లోకి అడుగు పెడుతుంటా” అని ఇటీవలే ఓ కార్యక్రమంలో తెలిపింది రష్మిక. ఇక ఈ మధ్య తరచూ తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై స్పందిస్తోంది.
#RashmikaMandana during Zee Cine Awards red carpet 💃📷🔥😍 @viralbhayani77 pic.twitter.com/8F6u0JEGWU
— Viral Bhayani (@viralbhayani77) February 27, 2023