అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప.. గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయిన ఈ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది.. పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యి అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ సునామి సృష్టించింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకేకుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. అయితే ఈ సినిమా నుంచి తాజాగా రష్మిక మందన్న ఫోటో ఒకటి లీక్ అయ్యింది.. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

ఒక సినిమాలోని షాట్ లో హీరోయిన్ అచ్చం శ్రీవల్లి పాత్రను పోలి ఉండటంతో ఈ వార్త వైరల్ అయింది. ఈ ఫోటో మరాఠీ మూవీకి సంబంధించిన ఫోటో కావడం గమనార్హం.. మరోవైపు పుష్ప2 మూవీ మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అంచనాలు పెట్టుకుని చూసినా సినిమా నిరాశపరచదని కేజీఎఫ్2 సినిమాను మించేలా సుకుమార్ ఈ సినిమాను ప్లాన్ చేశారని తెలుస్తోంది. పుష్ప2 మూవీలో ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుందని సమాచారం. పుష్ప2 మూవీ ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది..వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..

ఇకపోతే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. మరో మూడు సినిమాలను ఓకే చేశారని తెలుస్తోంది. అలవైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్‌తో ఓ భారీ సినిమాను చేయన్నారని సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నారని టాక్.. ఆ తర్వాత సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చెయ్యనున్నారని తెలుస్తుంది. పుష్ప సిరీస్‌లో మూడో పార్ట్ కూడా రానుందని తెలుస్తోంది. పుష్ప 2లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ ఓ భారీ ట్విస్ట్‌తో ముగిస్తారట. ఇక పుష్ప 3తో ఈ సిరీస్‌ను ముగిస్తారని తెలుస్తోంది.. ఆ సినిమా కథ కూడా రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ సినిమాలో ఎలాంటి ట్విస్ట్ లు పెడతాడో చూడాలి..