Rashmi Sudheer : మొత్తానికి రష్మీ, సుధీర్ ల ప్రేమ బయటపడింది

- Advertisement -

Rashmi Sudheer : జబర్దస్త్ జోడీల్లో రష్మీ- సుడిగాలి సుధీర్ జోడీ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి స్పెషల్ డే నాడు రష్మీ- సుడిగాలి సుధీర్ జోడీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించి సూపర్ కిక్కిస్తుంటారు బుల్లితెర షో నిర్వాహకులు. దీంతో ఆ జోడీపై లెక్కలేనన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. రష్మీ- సుడిగాలి సుధీర్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, వాళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని టాక్ నడిచింది. ఇంకొందరైతే ఏకంగా పెళ్లి కూడా కన్ఫర్మ్ చేసేశారు.

Rashmi Sudheer
Rashmi Sudheer

తాజాగా వీరి ప్రేమ వ్యవహారం మరోసారి బయటపడింది. అయితే వారిద్దరికీ సంబంధించిన ఫోటోను స్క్రీన్ షాట్ తీసి జబర్దస్త్ వర్ష స్టోరీ రూపంలో పంచుకుంది.అందులో చివర లవ్ సింబల్ను పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరూ ఈ షోలో తమ ప్రేమ గురించి ఓపెన్ అయ్యారేమో అని అందుకే ఈమె ఇలా స్టోరీ రూపంలో పంచుకుందేమో అని అనుమానాలు పుడుతున్నారు.మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Rashmi
Rashmi

ఇక ఈ రూమర్స్ నిజం కాదంటూ అటు రష్మీ, ఇటు సుధీర్ ఎవరికి వారు తమ స్పందన తెలిపినప్పటికీ అవి మాత్రం ఆగేలా లేవు. వీరి పేరు పైన సోషల్ మీడియాలో ఎన్నో ఖాతాలు సృష్టించి వాటి వేదికగా తమకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంటారు తమ అభిమానులు. రియల్ కపుల్స్ కంటే ఈ రీల్స్ కపుల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here