Rashmi : రష్మీ పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. సుధీర్ మాత్రం కాదు.. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో !

- Advertisement -


Rashmi : బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పొట్టి పొట్టి బట్టలేసుకుని హాట్ యాంకర్ గా అమ్మడికి బాగానే క్రేజ్ ఉంది. ఇక ఒక పక్క షోస్ చేస్తూనే ఇంకో పక్క సినిమాలతో అడపాదడపా గ్లామర్ పాత్రలతో దుమ్మురేపుతోంది. అమ్మడి కెరీర్ విషయం పక్కన పెడితే.. ఎన్నో ఏళ్లుగా రష్మీ పెళ్లి ఎప్పుడా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇప్పుడే పెళ్లి అన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇకపోతే సుధీర్ రష్మీ ప్రేమ, పెళ్లి అంటూ ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యారో తెలిసిందే. కాకపోతే సుధీర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని రష్మీ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఆ రొమాన్స్ అంతా ఆన్ కెమెరా వరకే అని, సుధీర్ ను పెళ్లి చేసుకొనే ఉద్దేశం తనకు లేదని కూడా తేల్చి చెప్పింది. అయినా కూడా అభిమానులు మాత్రం రష్మీ కనిపించిన ప్రతిసారి పెళ్లి ఎప్పుడు.. ? సుధీర్ అన్నతోనేనా.. ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటారు. అయితే న్యూ ఇయర్ రష్మీ తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది రష్మీ పెళ్లి వార్త చెప్పబోతుందంట.

rashmi gautam
rashmi gautam

ఇది ఇలా ఉంటే ఈటీవీ లో ప్రతి ఈవెంట్ ఏదో ఒక థీమ్ తో నిర్వహిస్తారు. ఇలా చాలాసార్లు.. రష్మీ పెళ్లి చేసేశారు.. సుధీర్ పెళ్లి చేశారు. మళ్లీ మరోసారి రష్మీ పెళ్లి థీమ్ తో ఈటీవీ ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసిందట. జనవరి 1 న న్యూ ఇయర్ పార్టీకి రష్మీ పెళ్లి కబురని ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఆ ప్రోమోను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో అందరు రష్మీని పెళ్ళెప్పుడు.. పెళ్ళెప్పుడు అని అడుగుతుండగా.. రష్మీ.. చెప్తా.. చెప్తా అని చెప్పుకొచ్చింది. చివరికి డిసెంబర్ 31 నైట్ మీ అందరికి నా పెళ్ళెప్పుడు అనేది చెప్తా.. అంటూ చెప్పేసింది. మరి ఈసారైనా అమ్మడు పెళ్లి పీటలు ఎక్కుతుందా.. ? లేదా ఇది కూడా ఈవెంట్ కోసమే అని చెప్పి షాక్ ఇస్తుందో చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here