Rashmi Gautham : టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈ క్యూటీ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అయితే రష్మీ గతంలో జబర్దస్త్ కమెడియన్ సుధీర్‌తో లవ్ ట్రాక్ నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరి లవ్ ట్రాక్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. వీరిద్దరికీ వేదికపై పెళ్లి చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన కార్యక్రమాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో కొంత కాలంగా సోషల్ మీడియాలో రష్మీ, సుధీర్ ల ప్రేమాయణం గురించి చర్చలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ జంట కలవాలని కోరుకునే అభిమానుల సంఖ్య చాలా ఉంది.

అయితే గత కొంత కాలంగా వెండితెరకు గుడ్ బై చెప్పిన సుధీర్ వెండితెరపై పలు సినిమాల ద్వారా తళుక్కుమంటున్నాడు. ఇటు రష్మీ కూడా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూనే.. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలతో బిజీగా ఉంది. సందర్భానుసారంగా ఈ టీవీలో కొత్త షోలు ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా రష్మీ పెళ్లి పార్టీ అనే కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ పార్టీకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో భాగంగా పెళ్లిపై రష్మీ బోల్డ్ కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ షోలో బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలబ్రిటీలు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు బాబా భాస్కర్, అమ్మ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పటిలాగే, హైపర్ ఆది, రష్మీ మధ్య సంభాషణ నవ్విస్తుంది. అనంతరం చమ్మక్ చంద్ర ఈ కార్యక్రమానికి రాగానే రష్మీ ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ తర్వాత చమ్మక్ చంద్ర రష్మీ నా పాదాలను తాకడం ఏంటి అని అడిగాడు.. మగాడు చాలా గొప్పవాడు, అమ్మాయికి తాళి కట్టి ఆలి చేస్తాడు.. తన పక్కన పడుకునే అవకాశం ఇస్తాడు. ఏడాది తిరిగే సరికి బిడ్డను ఇస్తారని చెప్పింది. అది విన్న బాబా భాస్కర్ రష్మీపై సెటైర్లు వేశారు. దీంతో షోలో అందరూ నవ్వుకున్నారు.

నీకు మగవాళ్లంటే కాస్త గౌరవం అని నాకు తెలుసు.. కానీ నీకు మరీ అంత గౌరవం ఉందని నాకు తెలియదని చమ్మక్ చంద్ర అంటున్నాడు. దీనిపై రష్మీ స్పందిస్తూ.. నాకు మగవాళ్లు అంటే పిచ్చి అని చెప్పింది. అయితే రష్మీ ఇదంతా ఓ స్కిట్‌లో భాగంగా చేస్తోందని తెలిసింది. ఈ కార్యక్రమానికి హనుమాన్ హీరో తేజ సజ్జ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 31న రాత్రి 9:30 నిమిషాలకు టెలికాస్ట్ అవుతుంది.