యాంకర్ Rashmi Gautam గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆమె మూగ జీవాలకు చేస్తున్న మంచి కన్నా జనాలు ఆమెపై వేసే ట్రోల్స్ ఎక్కువ..అలా నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తుంది.. కొన్ని సార్లు ఆమె పై వస్తున్న ట్రోల్స్ కొట్టినట్లు సమాధానం కూడా చెబుతుంది.. ఇప్పుడు ఓ బూతు మాట అని మరోసారి అడ్డంగా బుక్కయింది.రష్మీ గౌతమ్ డబుల్ మీనింగ్ డైలాగ్ తో అందరికీ షాక్ ఇచ్చింది. పిల్లలు పుట్టాలంటే మంచానికి దగ్గరగా ఉండాలంటూ… దారుణమైన పంచ్ వేసింది. దాంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఛీ.. ఛీ రష్మీ ఇలా ఎలా అంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..

ఒకప్పుడు జబర్దస్త్ స్కిట్స్ లో అడల్ట్ జోక్స్ బీభత్సంగా ఉండేవి. వాటిని ఒక వర్గం తెగ ఎంజాయ్ చేసేవారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని జోక్స్ వివాదాస్పదమయ్యాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కంటెంట్ విషయంలో మల్లెమాల సంస్థ పరిమితులు విధించింది. బూతు అర్థంతో కూడిన డబుల్ మీనింగ్ జోక్స్ వద్దని టీమ్ లీడర్స్ కి సూచించారు..తాజాగా యాంకర్ రష్మీ కొట్టిన పంచ్ డైలాగ్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. భార్యాభర్తల స్కిట్ లో… భర్త ‘పిల్లలు పుట్టాలంటే ఇలా కంచానికి దగ్గరగా ఉంటే కుదరదే’ అన్నాడు. భర్త పాత్ర చెప్పిన డైలాగ్ ని అందుకుంటూ రష్మీ ‘మంచానికి దగ్గరగా ఉండాలి’ అని గట్టిగా అరిచింది. పిల్లలు పుట్టడం, మంచం అంటూ బోల్డ్ పదాలు వాడారు. ఇక రష్మీ నోటి నుండి ఈ రేంజ్ బోల్డ్ జోక్స్ అంచనా వేయలేదని నెటిజన్స్ వాపోతున్నారు..

టీఆర్పీ కోసం హద్దులు చెరిపేశారన్న సందేహం కలుగుతుంది.. ఇటీవల స్టార్ మా లో ప్రసారమైన కొత్త షోలో రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమా ఆఫర్స్ కూడా తగ్గిన నేపథ్యంలో ఆమె యాంకరింగ్ మీద మరింత దృష్టి పెట్టారు.. రష్మీ పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. బోల్డ్ గ్లామరస్ రోల్స్ చేశారు. అయితే ఆమెకు బ్రేక్ ఇచ్చే ఒక్క హిట్ పడలేదు. దీంతో మేకర్స్ పక్కన పెట్టేశారు. గత ఏడాది బొమ్మ బ్లాక్ బస్టర్ టైటిల్ తో ఒక చిత్రం విడుదలైంది. నందు హీరోగా విడుదలైన ఆ చిత్రం కూడా ఆడలేదు.. ఇక రష్మీ గౌతమ్ పెళ్లి విషయం పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. దీనిపై రష్మీ మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు..