Rashmi Gautam : యాంకర్ రష్మీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు..యాంకరింగ్ కన్నా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో బాగా ఫెమస్ అయ్యింది.ఇక ఇప్పుడేమో డైరెక్ట్ గా బెదిరింపులకే దిగుతున్నారు. ఆమె చుట్టు వివాదం రాజుకుంటోంది. కొంత మంది దారుణంగా తిట్టిపోస్తున్నారునెటిజన్లు.యాంకర్ రష్మీతో నెటిజన్ల సోషల్ మీడియా వార్ తారాస్థాయికి చేరింది. మూగజీవాల తరపున మాట్లాడుతున్న రష్మీకిమానవత్వం ఎటు పోయిందంటూ.. మండిపడుతున్నారు సోషల్ మీడియా జనాలు ఇక కొంత మంది అయితే ఆమెపై కోపంతో రగిలిపోతున్నారు..

అంతేకాదు నువ్వు బయటకు వస్తే యాసిడ్ పోస్తాము అంటూ తెగ బూతులు తిడుతున్నారు. తాజాగా ఓ నెటిజన్ మెసేజ్ తెగ వైరల్ అవుతుంది..నువ్వు ఇంట్లోనే ఉండు.. పాపిస్టిదానా.. బయటకు వస్తే యాసిడ్ పోస్తాం.. చేతబడి చేయిస్తాం అంటూ… రష్మీపై విరుచుకుపడ్డాడు. ఇలా చాలా మంది నెటిజన్లు రష్మీతీరుపై రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఇదంతా రష్మీ గౌతమ్ కుక్కల తరపున మాట్లాడటం వల్లే వచ్చింది.. అసలు విషయానికి వస్తే..అంబర్ పేట్ లో కుక్కల దాడిలో పసికందు మరణించిన విషయం తెలిసిందే.

ఈ విషయంలో చాలా మంది సినీ..రాజకీయ ప్రముఖులు రకరకాలుగా స్పందించారు. ముఖ్యంగా మూగజీవాల అంటే ప్రాణం పెట్టే రష్మీ గౌతమ్ వాటికి మంచి స్పెష్ ఇవ్వాలి.వాటి పట్ల దయతో ఉండాలి అంటూ ఆమె మాట్లాడిన మాటలకు ఫైర్ అవుతున్నారు జనాలు.చిన్నారి మరణం పై కాస్త కూడా జాలి కలగలేదా అని విమర్శలు గుప్పిస్తున్నారు.ఈక్రమంలో నెటిజన్లకు ఆమెకు గత కొన్ని రోజులుగా వాదనలుజరుగుతున్నాయి. ఈక్రమంలోనే ఆమెకు బెదిరింపులు కూడా తప్పడంలేదు. అయితే రష్మీ తరపున కూడా కొంత మంది మాట్లాడుతున్నారు. వీధి కుక్కలకు ఫుడ్, షెల్టర్ ఉంటే ఇలాంటి సంఘటలను జరగవంటున్నారు. ఆకలితో ఉండి బయట తిరగడం వల్లే ఇలా జరుగుతుందంటున్నారు..ఈ విషయం ఇప్పటికే చర్చనీయాంసంగా మారింది.. మరి దీనికి రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి..