Anchor Rashmi : యాంకర్ రష్మీ చేస్తున్న పనికి.. చెప్పుతో కొడతానన్న నెటిజన్

- Advertisement -

Anchor Rashmi : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సెలబ్రెటీస్ ని బూతులు తిట్టే జనాలు ఎక్కువ అయ్యారు. కొందరు ట్రోలింగ్ చేస్తూ రకరకాల మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ పై ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది. యాంకర్ రష్మీ తీరుపై మండిపడ్డాడు. యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఆకర్షిస్తుంది. తన కో యాంకర్ సుధీర్ తో లవ్ స్టోరీ పేరుతో కుర్రాళ్లకు మంచి స్టఫ్ గా మారిపోయింది. అన్న, వదిన మధ్య అంతరాలను కలుపుతూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకున్నారు. మనకు తెలిసిందే యాంకర్ రష్మీ అనిమల్ లవర్. జంతువులను ఏదైనా సరే హింసిస్తూ ఉంటే అస్సలు ఊరుకోదు. వాళ్ల తాట తీస్తుంది.

వెండితెరపై హీరోయిన్‌గా, స్మాల్ స్క్రీన్‌పై యాంకర్‌గా రెండు చేతులా సంపాదిస్తున్న రష్మీ.. ఎన్నో సేవా కార్యక్రమాలకు తన సపోర్ట్ ఇస్తూ.. మెసేజ్‌లు పెడుతూ.. మూగజీవాలపై తనకున్న ప్రేమను చూపుతూ సెలబ్రిటీగా మారింది. సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు రష్మీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టులు పెడుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా నెట్‌లో ఓ వీడియో ట్రెండ్‌గా మారింది. ఒక వ్యక్తి తుపాకీ పట్టుకుని ఆవును కాల్చివేస్తుంటాడు. “ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి..?” అంటూ ఘాటుగా స్పందించింది. అయితే దీనికి ఒక నెటిజెన్ స్పందించాడు. ‘‘ నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి రష్మీ.. బయట జనాలు ఏ విధంగా ఉన్నారో తెలుసా? అమ్మాయిలను టార్చర్ చేస్తున్నారు ..బట్టలు లేకుండా హింసిస్తున్నారు.. మానభంగం చేస్తున్నారు .. వాళ్ల గురించి నువ్వు ఏ మాత్రం స్పందించవా..? కేవలం జంతువుల పై మాత్రమే స్పందిస్తావా..?” అంటూ మండిపడ్డారు .

- Advertisement -

ఈ వీడియోని షేర్ చేసిన నెటిజన్‌కు రష్మీ రిప్లై ఇచ్చింది. హిందువులుగా మనం ఇది జరగనిచ్చి ఉండాల్సింది కాదు. ఇదంతా మన తప్పే అన్నట్టుగా రష్మీ చెప్పింది. బ్రెయిన్ వాడండి.. ఈ రోజులు ఆవులు, కుక్కలు, రేపు మీ పిల్లలు.. ఒకసారి ఒక మనిషిని చంపడానికి సిద్దం అయితే.. వాడికి మనిషికి పశువుకి తేడా కనిపించదు.. అక్కడ ఏ ధర్మం పనికి రాదు అంటూ కౌంటర్లు వేసింది రష్మీ. గతంలో కూడా చీర కట్టుకుని జై శ్రీరాం అంటూ నినాదాలు చేసిన వీడియోపై రష్మీని విపరీతంగా ట్రోల్స్ చేశారు నెటిజన్స్. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది ఈ భామ. ఈ ట్రోల్స్ ఆమెకు కొత్తేమీ కాదు .. తను మూగజీవాలపై చూపించే కేరింగ్ చూసి కొందరు మగాళ్ళైతే దారుణంగా కామెంట్స్ చేస్తుంటారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here