శ్రీదేవీ డ్రామా కంపెనీ యాంకర్‌గా రష్మీ వచ్చి ఏడాది అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఎంతగా అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. అయితే ఆమె శ్రీదేవీ డ్రామా కంపెనీకి యాంకర్‌గా వచ్చి ఏడాది అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హంగామా చేస్తున్నారు. ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. రకరకాల ఎడిట్ వీడియోలు చేస్తూ రచ్చ చేస్తున్నారు.

శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రారంభంలో ఎలా ఉంది.. దానికి యాంకర్లుగా ఎవరున్నారు.. మధ్యలో ఎలాంటి మార్పులు వచ్చాయి.. సుధీర్ తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బుల్లితెరకు దూరం అయ్యాడు. ఢీ, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి షోలను వదిలేశాడు. ఆ తరువాత శ్రీదేవీ డ్రామా కంపెనీని కూడా వదిలేశాడు. అయితే సుధీర్ స్థానంలో వచ్చిన రష్మీ ఆ షోను బాగానే నడిపిస్తోంది. సుధీర్‌ను పరోక్షంగా గుర్తు చేస్తూనే ఇన్ని రోజులు ఆమె ఈ షోను నడిపిస్తూ వచ్చింది. ఈ షోకు యాంకర్‌గా వచ్చి నేటితో ఏడాది అయింది.

దీంతో రష్మీ అభిమానులు ఆమె మీద శుభాకాంక్షల వర్షాన్ని కురిపిస్తున్నారు. ప్రతీ సండే నాకు ఎంతో స్పెషల్ అవుతోంది.. అందరూ సండే నాడు వస్తోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షోను ఆదరిస్తూ ఉన్నారు.. ఆ షో అందరికీ నచ్చిందని తెలిసి ఎంతో సంతోషిస్తున్నాను.. ఇలానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి.. ఏదైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించండి.. ఇలానే ఆదరిస్తూ ఉండండి అని కోరింది రష్మీ.