Alia Bhatt : ఇండియా లోనే మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి అలియా భట్ మరియు రణబీర్ కపూర్ జంట. ఎన్నో సినిమాల్లో హీరోహీరోయిన్లు గా నటించిన ఈ జంట ఈమధ్యనే కొత్తగా పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే ఈ జంట ని చూసి కుళ్ళుకునే వారి సంఖ్య ఎక్కువే. ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయిన వీళ్లిద్దరి సంసార జీవితం ఇప్పుడు అనుకున్న స్థాయిలో సాగడం లేదని బాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త.
అందుకు కారణం అలియా భట్ పై రణబీర్ కపూర్ విధిస్తున్న ఆంక్షలే. ఇద్దరు బాలీవుడ్ లో టాప్ లీడింగ్ స్టార్స్. కెరీర్ పరంగా ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదు. అలియా భట్ రీసెంట్ చిత్రం లో రణవీర్ సింగ్ తో ఏ రేంజ్ లో రొమాన్స్ చేసిందో మనమంతా చూసాము.
అలాగే రణబీర్ కపూర్ కి కూడా సినిమాల వరకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ అలియా భట్ ఏమి చెయ్యాలన్న, రణబీర్ కపూర్ ని అడిగే చేయాలట. స్వేచ్ఛ పార్టీలకు వెళ్లేందుకు కూడా లేదట. ఆయన అనుమతి ఇస్తేనే ఎక్కడికైనా వెళ్ళాలట. ఇది అలియా భట్ కి ఏమాత్రం నచ్చడం లేదు. రీసెంట్ గానే ఆమె ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ ఇచ్చిన దీపావళి పార్టీ కి రణబీర్ కపూర్ లేకుండా ఒంటరిగా వెళ్లిందట.
తన అనుమతి లేకుండా ఒంటరిగా వెళ్లినందుకు అలియా భట్ పై రణబీర్ కపూర్ చాలా తీవ్రంగా ఫైర్ అయ్యాడట. పాపం దీనికి అలియా భట్ బాగా హర్ట్ అయ్యిందని సమాచారం. ఇప్పుడు అలియా భట్ పరిస్థితి ఎలా ఉందంటే పంజరం లో చిక్కుకున్న పంచదార చిలుక లాగా ఉందట. ఇదే విధంగా కొనసాగితే వీళ్ళ దాంపత్య జీవితం ముందుకు సాగదు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్.