
అలా సలహా ఇచ్చిన వారికి రణబీర్ సమాధానం గా చెప్తూ ‘దయచేసి నన్ను క్షమించండి.ఇక మీదట అలాంటి సినిమాలు చెయ్యను’ అని చెప్తున్నాడట. అయితే ఆయన కేవలం ఆ సమాధానం వారిని సంతృప్తి పరిచేందుకు, మొహమాటంతో చెప్పాడట. కానీ ఇదే విషయాన్నీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ఎనిమల్ లాంటి చిత్రాలు కొంతమంది ప్రముఖులకు నచ్చి ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా సాధారణ ఆడియన్స్ కి బాగా నచ్చింది. వాళ్ళు నాకు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందించారు. అందరు నన్ను కాబొయ్యే సూపర్ స్టార్ అని అంటూ ఉంటారు. ఇంకా నన్ను ఎన్ని రోజులు అలా అనిపించుకోమంటారు?, సూపర్ అయ్యే దిశగా అడుగులు వెయ్యాలి కదా. ఇప్పటి వరకు నేను గుడ్ బాయ్, లవర్ బాయ్ సినిమాలే చేస్తూ వచ్చాను. కానీ ఎనిమల్ చిత్రం నా ఇమేజిని మార్చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్.
ఇకపోతే త్వరలోనే ఆయన ‘ఎనిమల్’ సీక్వెల్ ‘ఎనిమల్ పార్క్’ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం తో పాటుగా ఆయన బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న రామాయణం లో కూడా నటించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ఫోటో షూట్ కూడా జరిగింది. ఈ చిత్రం లో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రావణాసురిడిగా కేజీఎఫ్ యాష్, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు.