Alia Bhat : రష్మికతో అలా చేస్తే.. అలియా కొడుతుంది. రొమాన్స్ గురించి చెప్పేసిన రణ్ బీర్..

- Advertisement -

Alia Bhat : తాజాగా విడుదలైన ‘యానిమల్’ ట్రైలర్.. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రేక్షకులు చూసినా.. ‘యానిమల్’తో మరోసారి అందరినీ ఇంప్రెస్ చేయడానికి ఈ దర్శకుడు సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు రణబీర్ నటించిన చాలా సినిమాల్లో తన యాక్టింగ్‌ ఎలా ఉంటుందో ప్రేక్షకులు పూర్తిస్థాయిలో చూశారు.

Alia Bhat
Alia Bhat

కానీ మునుపెన్నడూ లేని నెగిటివ్ షేడ్స్‌తో ‘యానిమల్’లో కనిపించనున్నాడు ఈ హ్యాండ్‌సమ్ హీరో. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే తండ్రిని అమితంగా ప్రేమించే నెగిటివ్ షేడ్స్ ఉన్న కొడుకు పాత్రలో రణబీర్ కనిపించనున్నట్టు అర్థమవుతోంది. అయితే ఈ క్యారెక్టర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు రణబీర్. తన పాత్రలతో తను చాలా డిటాచ్ ఉంటానని రణబీర్ క్లారిటీ ఇచ్చాడు. అది తమను ప్రేమించి వారిపై మంచి ప్రభావం చూపించదని అన్నాడు. అంతే కాకుండా నేను ఇంటికి వెళ్లి ఇలాగే ప్రవర్తిస్తే నా భార్య నన్ను కొడుతుంది అని ఫన్నీ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇక ఈ కామెంట్స్ చూసిన వారు అందుకేనా రష్మికతో అలా రొమాన్స్ చేశావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ‘యానిమల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాతో పాటు బాబీ డియోల్, రష్మిక కూడా హాజరయ్యారు. ఇక ఈ ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్.. దీని సక్సెస్‌పై మరింత నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఏ సినిమాకు లేనంతగా 3 గంటల 21 నిమిషాల నిడివితో ‘యానిమల్’ మూవీ రిలీజ్ అవుతుంది అని ప్రకటించగానే.. ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కొందరైతే డ్యూరేషన్ చూసే సినిమా ఫ్లాప్ అని డిసైడ్ చేసేశారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత రణబీర్ యాక్టింగ్ ‘యానిమల్’కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here