Rana Daggubati : దగ్గుపాటి రామానాయుడు మనవడిగా,విక్టరీ వెంకటేష్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానా, తన తొలిసినిమా ‘లీడర్’ తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత రెగ్యులర్ కమర్షియల్ హీరో లాగ కాకుండా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ఇండస్ట్రీ వైవిధ్య నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. డైరెక్టర్ క్రిష్ తో ఆయన చేసిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రం రానా కి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో మన అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో రానా అద్భుతమైన నటన చూసే డైరెక్టర్ రాజమౌళి తాను తీసే ‘బాహుబలి’ సిరీస్ లో రానా ని విలన్ గా తీసుకున్నాడు. ఈ చిత్రం లో బల్లాలదేవుడిగా రానా ఎంత భయంకరమైన విలనిజం పండించాడో మన అందరికీ తెలిసిందే. అప్పటి వరకు కేవలం టాలీవుడ్ కి పరిమితమైన రానా, ఈ సినిమా తో పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు ని దక్కించుకున్నాడు.
ఇదంతా పక్కన పెడితే రానా నటుడు కాకముందు కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు వీఎఫ్ఎక్స్ లో ప్రత్యేకమైన కోచింగ్ తీసుకున్నాడు. కొన్ని సినిమాలకు టాలీవుడ్ లో VFX గ్రాఫిక్స్ కంపోజర్ గా కూడా పని చేసాడు. అలా ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు , గుణ శేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ‘సైనికుడు’ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చేసాడు.
ఈ చిత్రం లో హైలైట్ గా నిల్చిన బ్రిడ్జి కూలిపోయే సన్నివేశం కి గ్రాఫిక్స్ డిజైన్ చేసిని రానానే. అంతే కాదు ఆ సినిమాలో అలాంటి గ్రాఫిక్స్ వర్క్ చాలా సహజం గా ఉండేటట్టుగా రానా భలే డిజైన్ చేసాడు. కానీ ఎందుకో ఆయన ఆ వృత్తి లో ఎక్కువ కొనసాగడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు హీరో అవ్వాలని అతనికి అనిపించింది. అలా లీడర్ సినిమా తో వెండితెర అరంగేట్రం చేసి నేడు ఈ స్థాయిలో ఉన్నాడు.