తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎలాంటి పాత్రని అయినా చెయ్యడానికి సిద్ధంగా ఉండే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రమ్య కృష్ణ. హీరోయిన్ గా కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయం లో ఏ హీరోయిన్ కూడా విలన్ రోల్స్ చెయ్యడానికి ఇష్టపడరు. అసలు అలాంటి సాహసం కూడా చెయ్యరు,ఎక్కడ తమ కెరీర్ పై దాని ప్రభావం పడుతుందో అని.
అలాంటి సమయం లో రమ్య కృష్ణ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘నరసింహా’ చిత్రం లో విలన్ పాత్ర పోషించింది. అప్పట్లో ఈ పాత్ర ఎంత హైలైట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. లేడీ విలన్ రోల్స్ ట్రెండ్ మొదలైంది ఈ చిత్రం నుండే. రమ్య కృష్ణ ధైర్యం చేసి నెగటివ్ రోల్ చేసినప్పటికీ ఆమె కెరీర్ మీద ఎలాంటి ప్రభావం పడలేదు. ఇంకా చెప్పాలంటే ఈ పాత్ర ఆమెని సూపర్ స్టార్ రేంజ్ కి తీసుకెళ్లింది.
ఆ తర్వాత ఆమె అడుగుజాడల్లో నడుస్తూ సిమ్రాన్ , జ్యోతిక, త్రిష , తమన్నా, సమంత వంటి స్టార్ హీరోయిన్స్ కూడా నెగటివ్ రోల్స్ చేసారు కానీ రమ్య కృష్ణ ని మాత్రం మ్యాచ్ చేయలేకపోయారు. అయితే ఈమెకి తొలుత ఈ పాత్ర చెయ్యడం అసలు ఇష్టం ఉండేది కాదట. డైరెక్టర్ ‘నరసింహా’ మూవీ స్టోరీ చెప్పగానే ఆమె సౌందర్య పాత్ర కావాలని అడిగింది అట. కానీ డైరెక్టర్ కె ఎస్ రవికుమార్ పట్టుబట్టి బలవంతం చేసి రమ్య కృష్ణ ని ఒప్పించి ఈ పాత్ర చేయించాడు.
సినిమా విడుదల తర్వాత ఆ పాత్ర కి వచ్చిన రెస్పాన్స్ ని ఈ జన్మలో మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చిన రమ్య కృష్ణ చెప్పుకొచ్చింది. అదే సమయం లో ఒక సన్నివేశం లో ఆమె హీరోయిన్ సౌందర్య చెంప పై తన కాళ్ళను తాకించడం చాలా ఇబ్బందిగా అనిపించిందని, నా మనసుకి ఇష్టం లేకపోయినా కూడా డైరెక్టర్ ఇలాంటి సన్నివేశాలు బలవంతంగా చేయించాడు అంటూ చెప్పుకొచ్చింది రమ్య కృష్ణ. ఆ సన్నివేశం తల్చుకుంటే ఇప్పటికీ బాధవేస్తుంది అంటూ కామెంట్ చేసింది.