Ramya Krishna : జైలర్ ఆడియో లాంచ్‌కు ముందు రమ్యకృష్ణ కావాలా సాంగ్ కు డ్యాన్స్ చేసిన వీడియోను..తన ఇన్‌స్టాగ్రామ్ నుండి షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మంచి హుషారైన స్టెప్స్ తో రమ్య కృష్ణ డ్యాన్స్ ఇరగదీసిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐదు పదుల వయసులోనే అదిరిపోయే స్పెప్పులేసి అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది. తన సిబ్బందితో కలిసి రమ్యకృష్ణ స్టెప్పులేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, రజనీకి భార్యగా కనిపించనుంది.

అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన కావాలయ్యా ఫస్ట్ సింగిల్ జూలై 6 న రిలీజ్ అయ్యి.. నేషనల్ వైడ్ గా ఫేమస్ అయింది. ఈ సాంగ్ లో తమన్నా వేసిన స్టెప్స్ తో కుర్రోళ్లకు మత్తెక్కించారు. ఇప్పుడు ప్రతి ఒక్క సెలెబ్రెటీ ఈ సాంగ్ను వీడియోస్ రూపంలో.. సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం వల్ల.. మరింత హైప్ క్రియేట్ అయింది. దీంతో ఈ మూవీ నుంచి రిలీజ్ కాబోయే సాంగ్స్, ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . నువ్వు కావాలయ్యా ఫుల్ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. సూపర్ స్టార్ రజనీతోపాటు.. ఎంతో మంది అభిమానులు హాజరయ్యారు. తమన్నాతోపాటు.. రజినీ కలిసి ఈ పాటకు సిగ్నేచర్ స్టెప్పులేశారు.

నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ మూవీ రజనీకాంత్ 169వ చిత్రం.ఈ మూవీలో జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, వసంత్ రవి, తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా జైలర్ 2023 ఆగస్ట్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.