Actress Ramba : తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. అందం, నటన, టాలెంట్ తో పాటుగా బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. అవన్నీ కలిసొచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రంభ. ఈమె ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా భారీ హిట్ అవ్వడం తో ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి సినిమాలు చేసింది. కేవలం తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఒక తెలుగు అమ్మాయి ఇన్ని భాషల్లో చక్రం తిప్పడం కేవలం రంభ విషయం లోనే సాధ్యపడింది. అయితే ఈమె మెగాస్టార్ చిరంజీవి తో కలిసి పనిచేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన ని గుర్తు చేసుకొని సంబరపడింది రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో.
చిరంజీవి తో కలిసి గతం లో ఆమె ‘బావగారు బాగున్నారా’, ‘అల్లుడా మజాకా’, ‘హిట్లర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. అయితే ‘హిట్లర్’ సినిమా షూటింగ్ సమయం లో జరిగిన ఒక సంఘటన గురించి రంభ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ ఈ అద్దం గురించి చెప్తే నా మీద పోలీస్ కేసు పడుతుంది. ఈ అద్దం ఎవరిదో తెలుసా, చిరంజీవి గారిది. నా మేకప్ మ్యాన్ మరియు చిరంజీవి గారి మేకప్ మ్యాన్ కి బంధువు అవుతాడట.
ఒకరోజు నా మేకప్ మ్యాన్ కి డేట్స్ క్లాష్ వచ్చి షూటింగ్ కి రాలేదు. ఆరోజు చిరంజీవి గారి మేకప్ మ్యాన్ నా కోసం పనిచేసారు. ఆయన చిరంజీవి గారి అద్దం ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆరోజు షూటింగ్ మొత్తం నేను ఆ అద్దంని వాడుకున్నాను. పొరపాటుగా ఆ అద్దం ని నాతో పాటుగా తెచ్చేసాను, అప్పటి నుండి చిరంజీవి గారికి గుర్తుగా ఈ అద్దం ని నాతో ఉంచేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రంభ.