Isha Sahani : కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా కల్ట్ స్టేటస్ ని పొందుతాయి.క్లాసిక్స్ గా మిగులుతాయి. అలాంటి సినిమాలలో ఒకటేసుకుమార్ – రామ్ కాంబినేషన్ లో వచ్చిన ‘జగడం’. దేవదాస్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ మరియు ఆర్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ ఇద్దరు కలిసి చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు మామూలు రేంజ్ హైప్ ఉండేది కాదు. దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ ఆరోజుల్లో ఒక ఊపు ఊపేసింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడం లో విఫలమై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ అప్పటి ఆడియన్స్ కి ఈ సినిమా సరిగా నచ్చలేదు కానీ, ఇప్పటి జెనెరేషన్ యూత్ కి తెగ నచ్చేసింది. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులకు కూడా ఈ చిత్రం అంటే ఎంతో ఇష్టం.

ఇక ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటించిన ‘ఇషా సహానీ’ కి ఆరోజుల్లో యూత్ మొత్తం ఫ్లాట్ అయ్యారు. ఎవరు ఈ అమ్మాయి ఇంత క్యూట్ గా ఉంది అని అందరి దృష్టిని తెగ ఆకర్షించింది. అయితే ఈ సినిమా తర్వాత కేవలం ఆమె ‘బ్యాడ్ బాయ్’ అనే చిత్రం లో మాత్రమే నటించింది. ఆ తర్వాత ఏ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించలేదు. ఇంత అందమైన అమ్మాయి ఎందుకు అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంది. హీరోయిన్ అయ్యే అదృష్టం అందరికీ దక్కదు కదా. అలాంటిది మంచి ఫేమ్ వచ్చినా కూడా ఎందుకు ఆ ఛాన్స్ ని వదులుకుంది అని ఇప్పటికీ ఈ అమ్మాయిని చూసినప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో, ఏమి చేస్తుందో ఎవరికీ కూడా తెలియదు, కానీ ఆమె గురించి రీసెంట్ గా మాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీకు తెలియచేస్తున్నాము.

ఇషా సహానీ 1984 వ సంవత్సరం అక్టోబర్ 29 న జన్మించింది.సినిమాల్లోకి రాకముందు ఈమె దక్షా సేత్ డ్యాన్స్ కంపెనీ లో మెయిన్ డ్యాన్సర్ గా పనిచేసేది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె ఆరోజుల్లోనే ఎన్నో లైవ్ కన్సర్ట్స్ లో లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చేది. అలా ఆమె ముంబై, లండన్, పెర్త్ మరియు ఒమాన్ వంటి ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చేది. కేవలం తనకి వచ్చిన ఆ డ్యాన్స్ తోనే ఈమె ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లో చోటు సంపాదించింది. అలా డైరెక్టర్ సుకుమార్ దృష్టిలో పడిన ఈమె జగడం సినిమాలో అవకాశం సంపాదించింది. ఆ తర్వాత బ్యాడ్ బాయ్ అనే తమిళ సినిమా చేసి, లండన్ కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్ళాడి, సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఆమె అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ ని రన్ చేస్తున్నట్టు సమాచారం. ఆమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి ఎక్సక్లూసివ్ మీ కోసం అందిస్తున్నాము చూడండి.
