ఒకపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఒకడు రామ్ గోపాల్ వర్మ. ఇందులో ఎలాంటి సందేహం లేదు, అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘శివ’ చిత్రం ద్వారా ఈయన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆరోజుల్లో శివ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి, ఈ చిత్రం సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఆ సినిమాతో రామ్ గోపాల్ వర్మ పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోయింది. అప్పటి స్టార్ హీరోలందరూ రామ్ గోపాల్ వర్మ తో ఒక సినిమా చెయ్యాలని పరితపించేవారు. అలా ఆయన పాపులారిటీ బాలీవుడ్ కి పాకి, అక్కడ కూడా ఆయన అవకాశాలను సంపాదించి, హిట్టు మీద హిట్టు కొడుతూ స్టార్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ఎదిగాడు.
అలాంటి స్థాయిని సంపాదించుకున్న ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు ఏ స్థానం లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎల్లపుడూ వివాదాలకు తావు ఇస్తూ, బూతు బొమ్మలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ రత్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతనిని భరించలేక ఆమె ఎప్పుడో విడిపోయింది. అయితే వీళ్లిద్దరు జూబ్లీ హిల్స్ లో కాపురం చేస్తున్నప్పుడు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవట.
పెద్ద పెద్దగా అరుచుకుంటూ చుట్టూ పక్కన ఉన్నవాళ్లకు తలనొప్పిగా మారేవారట. ఎక్కువగా రత్న నే రామ్ గోపాల్ వర్మ మీద అరుస్తూ ఉండేది, ఒకానొక సందర్భం రోడ్డులోనే రామ్ గోపాల్ వర్మ ని కొట్టిందట. ఇది రామ్ గోపాల్ వర్మ తండ్రికి చాలా బాధని కలిగించిందట, ఒక భర్త పై భార్య ఇలాగేనా ప్రవర్తించేది, అంతలా కలిసి ఉండలేకపోతే విడిపోవచ్చు కదా అనేవాడట, అలా కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు.