Ram Gopal Varma జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చెయ్యడం ఎలా అనేది ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ని చూసి నేర్చుకోవచ్చు.ఒకప్పుడు ఈయన దిగ్గజ దర్శకులలో ఒకడే, కానీ ప్రస్తుతం బుర్ర చెడిపోయి నోటికి వచ్చిన పిచ్చి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ, బూతు సినిమాలు చేస్తూ కాలం గడిపేస్తూ ఉన్నాడు.కానీ 60 ఏళ్ళ వయస్సులో మనసుకు నచ్చింది చేసి ఎంజాయ్ చెయ్యడం,ఇష్టమొచ్చినట్టు తిరగడం వంటివి చూస్తే ఎవరికైనా ‘బిందాస్ లైఫ్ అంటే ఇదే కదా’ అని అనిపించక తప్పదు.

అయితే రామ్ గోపాల్ వర్మ మాటలు ఒక్కోసారి చాలా ఆలోచింపజేసేలా చేస్తాయి.ఆ మాటలు వింటే ఈయనతో ఒక గొప్ప మేధావి దాక్కున్నాడు, బాగా చదువుకున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది.కానీ ఈరోజే ఈయన ఎంత పూర్ స్టూడెంట్ అనే విషయం అర్థం అయ్యింది.రీసెంట్ గా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వేసిన ఒక ట్వీట్ సంచలనం గా మారింది.

అసలు విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ 37 ఏళ్ళ క్రితం నాగార్జున యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడట.అయితే రీసెంట్ గా ఆయనని నాగార్జున యూనివర్సిటీ లో జరిగిన ఒక కీలకమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశిస్తూ వాళ్లలో జీవితానికి సంబంధించిన కొన్ని సత్యాలను తనదైన శైలిలో వివరించి చెప్పాడు.అయితే ప్రసంగం మొత్తం పూర్తి అయినా తర్వాత నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు రామ్ గోపాల్ వర్మ కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసారు.

అదేమిటంటే, ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేసే ఉద్దేశ్యం లేక సరిఫికేట్ ని తీసుకోలేదట.ఇప్పుడు ఆయనకి ఆ సర్టిఫికెట్ ని ప్రధానం చేసారు.అందులో ఆయనకి సెకండ్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యాడు.అంటే 50 శాతం కంటే తక్కువ అన్నమాట.ఇది చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఇంత పూర్ స్టూడెంటా అని ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.