Ram upasana : అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వీధుల్లో రామ్ చరణ్ ఉపాసన చక్కర్లు కొడుతున్నారు. తమకు కావాల్సిన థింగ్స్ కోసం ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఉపాసన కోసం రామ్ చరణ్ తన స్టేటస్ మార్చి భర్త ల తన భార్యకి సేవలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటింది. ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయంగా అవార్డులను అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డుల బరిలో కూడా ఈ సినిమా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్ర టీమ్ మొత్తం అమెరికా పర్యటనలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా అమెరికా పర్యటనలో భాగమై అక్కడ సమయం దొరకగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఉపాసన కలిసి దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇద్దరు కలిసి బోటింగ్, షాపింగ్ చేస్తున్న ఫోటో, వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో చెర్రీ ఉపాసన చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. రామ్ చరణ్ షాపింగ్ చేసిన బ్యాగులను పట్టుకోగా.. ఆయన ముందు ఉపాసన స్టైల్ గా నడుస్తున్న ఫోటోలు పై నేటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఎంత గ్లోబల్ స్టార్ అయినా భార్య షాపింగ్ బ్యాగ్ ని మోయాల్సిందే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేగా మరి బయట ఎంత కింగ్ ఆయిన భార్య ముందు తగ్గాల్సిందే అనే ఫార్ములా ను చెర్రీ ఫాలో అవుతున్నాడు.

ఇక ఈ ఫోటోలను సోషల్
పైగా ఉపాసన ప్రెగ్నెంట్.. దాంతో తన భార్యను కందిపోకుండా చూస్కోవలసిన బాధ్యత తనదే. తన ధర్మాన్ని తను పాటిస్తున్నాడు.. ఉపాసన రామ్ చరణ్ జంట చూడ ముచ్చటగా ఉన్నారు.. మరి కొన్ని రోజుల్లో ఈ ఇద్దరు కాస్త ముగ్గురు అవుతారు అంటూనేటిజన్స్ పోస్టులు చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా మెగా వారసుడు కోసం ఈగర్ గా వైయిట్ చేస్తున్నారు.
