Ram Charan : ఆస్కార్ వేదికపై మళ్ళీ నాటునాటు.. ఆశ్చర్యం వేసింద‌న్న చ‌ర‌ణ్‌

- Advertisement -

Ram Charan : మాస్కోకెళ్ళే ఆస్కారం లేకపోయినా, విస్కీ సేవిస్తూ స్క్రీన్ పై జీవిస్తా అన్నది శ్రీశ్రీ రాసిన మరో మూడు యాభైలు కవితా సంకలనంలోనిది. అలా ఆస్కారొచ్చే ఆస్కారం లేకపోయినా, ఆస్కార్ అనే సబ్జెక్టు కోటానుకోట్ల మంది భారతీయుల సోదిలోనే లేదెప్పుడూ. కానీ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికి ఆస్కార్ అంటే పూర్తిగా తెలిసిపోయింది. మొత్తం సబ్జెక్టంతా పట్టుబడిపోయింది. దానికి కారణం ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అని రాయప్రోలువారు రాసినట్టుగా, ఇండియన్ ఫ్లాగ్ తొలిసారి ఆస్కార్ వేదిక మీద సగర్వంగా రెపరెపలాడడమే. అదీ మన తెలుగు పాట. పాడనా తెలుగుపాట పరవశనై అన్న దేవులపల్లివారి పాటలా….తెలుగుపాట ప్రపంచం నలుమూలలా దద్దరిల్లిపోయింది. తెలుగంటే ఇండియాలోనే మహానుభావుడు ఎన్టీ ఆర్ వచ్చే వరకూ ఎవ్వరికీ తెలియదు.

ఇంక ప్రపంచం సంగతి ఎందుకు? కానీ రాజమౌళి పుణ్యమా అని, చంద్రబోస్ కలమహిమ, కీరవాణి స్వరమహిమ……ఆస్కార్ వేదికను గడగడలాడించింది నాటునాటు పాట. దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీ క్రిష్ణ దేవరాయలువారి పద్యాన్ని మించి ప్రపంచభాషలందు తెలుగు లెస్ప అన్న అపూర్వమైన గౌరవాన్ని తెలుగుకి, తెలుగుపాటకి కల్పించారు రాజమౌళి, చంద్రబోస్, కీరవాణి త్రయం. గత సంవత్సరం నాటునాటు పుట్టించిన కేక ఇప్పటికీ ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలో ఎవ్వడూ మరచిపోలేదు. పాటను పల్లవి చరణాలతో సహా కంఠస్థ పెట్టేశారు ప్రతీ వరల్డ్ లాంగ్వేజ్ లోనూ. ఆస్కార్ గెలిచిన సంవత్సరం సరే…..గెలిచిన సంవత్సరం కాబట్టి ఆ కోలాహలం వేరు.

కానీ ఈ సంవత్సరం కూడా నాటునాటు విజువల్ని ఆస్కార్ వేదికమీద షో చేశారు. ఈ సారి ఆస్కార్ గెలుచుకున్న వాట్ వజ్ ఐ మేడ్ అనే పాటకి లభించిన ఆస్కార్ అవార్డును తీసుకోవడానికి ఆ పాటను పాడిన అరియానా గ్రాండే, సింధియా ఎరివో ఇద్దరూ వెళ్తుంటే, వెనుకగా నాటునాటు విజువల్తో సహా ఆడియో ఆస్కార్ హాలులో హోరెత్తిపోయింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ చాలా సెలబ్రేట్ చేసుకున్నాడు. ‘’నిజంగా ఆశ్చర్యం. ఆస్కార్ వేదికమీద…మళ్ళీ నాటునాటు…మనపాట. ఎంత గౌరవం’’ అని ఉప్పొంగిపోయాడు రామ్ చరణ్. భారతీయులందరి గొంతుతో రామ్ చరణ్ వ్యక్తం చేసిన ఫీలింగ్ ఈ అఖండభారతావనికి చెందుతుంది అంటూ చ‌ర‌ణ్ ఆనందం వ్య‌క్తం చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com