Ram charan: ఆస్కార్ వేడుకలో పుట్టబోయే బిడ్డపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

- Advertisement -

Ram Charan: రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు సినీ ప్రేక్షకులంతా సంబరాలు చేసుకుంటున్నారు. దేశం గర్వించేలా చేసిన రాజమౌళి యూనిట్ మొత్తానికి అభినందనలు చెబుతూ హోరెత్తిస్తున్నారు.. ఈ వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ వేడుకకి రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరయ్యారు. తాజాగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పుట్టబోయే బిడ్డ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు..

Ram charan and Upasana
Ram charan and Upasana

బ్లాక్ కలర్ సూట్ లో రామ్ చరణ్, క్రీమ్ కలర్ శారీలో రాయల్ లుక్ లో మెరిసిపోతూ ఉపాసన రెడ్ కార్పెట్ మీద నడిచారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో వీరిద్దరూ ముచ్చటించగా.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. రామ్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీలో భాగం అయ్యేందుకు ఇక్కడికి వచ్చాను. కొంచెం నర్వస్ గా ఉంది. కానీ చాలా సంతోషంగా ఉంది అని ఉపాసన తెలిపారు.

Ram Charan Upasana at Oscar Event

రామ్ చరణ్ మాట్లాడుతూ అభిమానులకు ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఉపాసన ఇప్పుడు ఆరో నెల గర్భవతి పుట్టబోయే బిడ్డ మాకు ముందుగానే ఎంతో అదృష్టం తీసుకొచ్చింది. తను బయటకు రాకుండానే ఇంతమంది ప్రేమను సొంతం చేసుకున్నాడు అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అమెరికా వెళ్లడానికి కొద్ది రోజులు ముందే ఉపాసన స్నేహితులందరూ కలిసి ఆమెకు సీమంతం కూడా చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ సంగతి తెలిసిందే.

- Advertisement -

గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నీఫర్ ఆస్టన్ ఉపాసనకి డెలివరీ చేయనున్నారని తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here